Rahul Gandhi : ప్రధాని మోదీ.. దేవుడికే పాఠాలు నేర్పించగలరు : రాహుల్ గాంధీ

ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరని పేర్కొన్నారు.

Rahul Criticized Modi : కాంగ్రెస్ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా వేదికగా మరోసారి ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ.. దేవుడికే పాఠాలు నేర్పించగలరంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని, ప్రజలను భయపెడుతోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. ప్రజలతో మమేకమయ్యేందుకు అవసరమైన అన్ని సాధనాలను బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్‌ నియంత్రించిందని ఆరోపించారు.

ఒకప్పటి రాజకీయ వ్యూహాలు ఇక పని చేయవని అర్థమైందన్నారు. అందుకే భారత్‌ జోడో యాత్రను చేపట్టానని చెప్పారు. తన యాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది కానీ, అవి ఫలించలేదన్నారు. తమ యాత్రకు మరింత ఆదరణ దక్కిందని.. ఆ ప్రయాణంలో తాను ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపారు.

MLC Kavitha: ఇది కల కాదు కదా..? శుభకార్యంలో పాల్గొని మాట్లాడుకున్న బండి సంజయ్, కల్వకుంట్ల కవిత

అమెరికా పర్యటనలో ప్రవాస భారతీయులతో జరిగిన కార్యక్రమంలో ప్రధాని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ విమర్శలు చేశారు. కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలతో రాహుల్ గాంధీ చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు.

అంతా తమకే తెలుసని ప్రజలను నమ్మించే వ్యక్తులు భారత్‌లో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని పేర్కొన్నారు. వారు శాస్త్రవేత్తలకే శాస్త్రాన్ని చెబుతారు, చరిత్రకారులకు చరిత్రను వివరిస్తారు, సైన్యానికి యుద్ధాన్ని నేర్పిస్తారని తెలిపారు. వారు దేవుడితో కూర్చుంటే ఆయనకే అన్నీ వివరించగల సమర్థులని, అందుకు ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప ఉదాహరణ అన్నారు.

Yerragondapalem Constituency: యర్రగొండపాలెంలో గెలుపు నీదా, నాదా.. సై అంటున్న వైసీపీ, టీడీపీ

ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరని పేర్కొన్నారు. అప్పుడు భగవంతుడు కూడా తాను సృష్టించిన విశ్వం ఇదేనా అని గందరగోళానికి గురవుతారంటూ రాహుల్‌ గాంధీ ఎద్దేవా చేశారు.

ప్రవాస భారతీయులను ఉద్దేశించి రాహుల్​ గాంధీ మాట్లాడుతుండగా ఆయనకు వ్యతిరేకంగా బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేశారు. రాహుల్​ ని చూసి జోడో.. జోడో’ అని బీజేపీ మద్దతుదారులు అరిచారు. కాంగ్రెస్‌ పార్టీ అంటే అందరికి అభిమానం ఉందన్నారు.

AV SubbaReddy: నిన్ను నేను భుజాల మీద ఎత్తుకుని పెంచాను.. నేను నీ చున్నీ లాగానా అఖిల ప్రియ?: ఏవీ సుబ్బారెడ్డి

ఎవరైనా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు రావాలనుకుంటారని పేర్కొన్నారు. ఎవరైనా వచ్చి ఏం మాట్లాడినా మేం పట్టించుకోవడం లేదు, కోపగించుకోవడం లేదు. ఎవరు ఏం చెప్పినా శ్రద్ధగా వింటామని, వాళ్లతో ప్రేమగా ఉంటామని తెలిపారు. ఎందుకంటే అది మన స్వభావం అని తన ప్రసంగమని రాహుల్ గాంధీ కొనసాగించారు.

ట్రెండింగ్ వార్తలు