AV SubbaReddy: నిన్ను నేను భుజాల మీద ఎత్తుకుని పెంచాను.. నేను నీ చున్నీ లాగానా అఖిల ప్రియ?: ఏవీ సుబ్బారెడ్డి

అవమానం జరిగింది తనకని.. దెబ్బలు తగిలింది కూడా తనకేనని సుబ్బారెడ్డి చెప్పారు.

AV SubbaReddy: నిన్ను నేను భుజాల మీద ఎత్తుకుని పెంచాను.. నేను నీ చున్నీ లాగానా అఖిల ప్రియ?: ఏవీ సుబ్బారెడ్డి

Akhila priya AV Subba Reddy

AV SubbaReddy – Bhuma Akhila Priya: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ మంత్రి భూమా అఖిల ప్రియపై టీడీపీ (TDP) నేత ఏవీ సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ పట్టుకుని లాగారని, తన దుస్తులు చిరిగిపోయాయని భూమా అఖిలప్రియ ఆరోపించిన విషయం తెలిసిందే. అందుకే తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారని ఇటీవలే అఖిల ప్రియ తెలిపారు.

దీనిపై ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ” నిన్ను నేను భుజాల మీద ఎత్తుకుని పెంచాను చున్ని లాగాను అనడం దారుణం. నాగిరెడ్డి పబ్లిక్ మీటింగ్ లలో ఏవీ, భూమా వేరు కాదని ఎన్నో సార్లు చెప్పారు. పార్టీ ఆదేశిస్తే నంద్యాలలో లేదా అళ్లగడ్డలో పోటిచేస్తాను.

అవమానం జరిగింది నాకు.. దెబ్బలు తగిలింది నాకు.. నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తిట్టడం ఏమిటి? అఖిల ప్రియ అనుచరులు కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు. వాళ్లను అఖిల తన వెంట ఎందుకు తిప్పుకుంటుందో పోలీసులను అడుగుతాను. భార్గవ్ రామ్ మీద పొలీసులు ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదు? ఏవీ సుబ్బారెడ్డి ఎట్టి పిరిస్థితుల్లోనైనా పార్టీ వీడే ప్రసక్తే లేదు.

పార్టీ నన్ను దూరం పెడితే ఇంట్లొ కూర్చొని బాధపడతా.. తప్ప పార్టీ మారను. నేను తప్పు చేస్తే పోలీసులకు ఆధారాలు ఇవ్వు.. నన్ను అరెస్టు చేస్తారు.. నంద్యాలలో టీడీపీ ఇన్‌ఛార్జి భూమా బ్రహ్మనంద రెడ్డి, ఫరూక్ ఉన్నప్పుడు నంద్యాలలో పార్టీ ఆఫీసు పెట్టడం నీకు ఏమి పని? లోకేశ్ పాదయాత్ర సక్సెస్ అయిందంటే నీ వల్ల కాదు..

లోకేశ్ పై ఉన్న అభిమానంతో జనాలు పాదయాత్రలో పాల్గొన్నారు. నువ్వు సొంతంగా మీటింగ్ పెడితే జనాలు వచ్చే పరిస్థితి లేదు. పాదయాత్రకు లోకేశ్ ను స్వాగతం పలికే విషయంలో సపరేట్ టెంట్ వేసి గ్రూపు రాజకీయాలు చేశావు. నేను అళ్లగడ్డలో సొంతంగా టీడీపీ ఆఫీసు పెట్టగలను.. కానీ నేను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటాను” అని అన్నారు.

Viveka Case: అవినాశ్ రెడ్డి‌పై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి.. సీబీఐపై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు