దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారు : మోడీపై రాహుల్ ఫైర్
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థను మోడీ నాశనం చేశారని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో నాశనమైన ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు కోలుకోలేదన్నారు. ఢిల్లోలో జరిగిన కాంగ్రెస్ సభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని తనను తాను గొప్ప దేశభక్తుడినని చెప్పుకుంటున్నారని అన్నారు. దేశ ద్రోహులు కూడా చేయని పనులు మోడీ చేశారని ఆరోపించారు.
పేదల నుంచి లాక్కొని అంబానీకి దోచి పెడుతున్నారని విమర్శించారు. అంబానీ, అదానీలకు బడా కాంట్రాక్టులు అప్పనంగా ఇచ్చారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. దేశంలో ఉల్లి ధర రూ.200 లకు పెరిగిందని విమర్శించారు. జీఎస్టీ అంటే గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని ఎద్దేవా చేశారు.
తన పేరు రాహుల్ సావార్కర్ కాదని.. రాహుల్ గాంధీ అని తెలిపారు. రేప్ ఇన్ ఇండియా వ్యాఖ్యలపై తాను క్షమాపణ చెప్పనని స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలా అని ప్రశ్నించారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. కాగా బహిరంగ సభకు పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.