Rahul
rahul gandhi’s : కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్రాక్టర్ యాత్ర చేపట్టనున్నారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన agricultural laws ను నిరసిస్తూ..పంజాబ్ (panjab) లో ‘Kheti Bachao’ పేరిట ట్రాక్టర్ యాత్ర జరుపనున్నారు. ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ తో కలిసి ట్రాక్టర్ యాత్రకు నాయకత్వం వహించనున్నారు.
మోగా జిల్లా నుంచి ఈ ర్యాలీ ప్రారంభం కానుంది. జత్పురా వరకు ట్రాక్టర్ యాత్ర జరుగనుంది. మార్గమధ్యలో రైతులతో రాహుల్ మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగే ఈ ర్యాలీలో సుమారు 3 వేల ట్రాక్టర్ లు ఉంటాయని భావిస్తున్నారు. 2020, అక్టోబర్ 04వ తేదీ ఆదివారం జరిగే ఈ యాత్ర 22 కిలోమీటర్ల వరకు ఉండనుంది.
ఉదయం 11 గంటలు : పంజాబ్ లోని Moga జిల్లాలోని Badhni Kalan లో రాహుల్ బహిరంగసభ నిర్వహిస్తారు.
12.15 గంటలు : Badhni Kalan నుంచి Jatpura వరకు యాత్ర ప్రారంభిస్తారు.
మూడు ప్రాంతాల్లో (Lapon, Chakar, Manoke) వద్ద రైతులతో మాట్లాడుతారు. వినతిపత్రాలు స్వీకరిస్తారు.
3 గంటలు : లుథియానాలో Jatpuraలో జరిగే బహిరంగసభలో రాహుల్ మాట్లాడనున్నారు.
ఈ నిరసన ర్యాలీలో పంజాబ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పాల్గొంటారని పంజాబ్ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీ హరీష్ రావత్ తెలిపారు.
2020, అక్టోబర్ 05వ తేదీ సోమవారం వయనాడ్ ఎంపీ సంగ్రూర్ జిల్లాలో మరో ట్రాక్టర్ ర్యాలీకి నాయకత్వం వహిస్తారు.
మూడు రోజుల పాటు వివిధ జిల్లాల్లో 50 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల యాత్రను నిర్వహించడం జరుగుతుందని పంజాబ్ కాంగ్రెస్ ప్రతినిధి వెల్లడించారు.
కోవిడ్ – 19 నిబంధనలు అనుసరించి యాత్రలు జరుగుతాయన్నారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రాష్ట్రంలో రైతులు ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు. 2020, అక్టోబర్ 05వ తేదీ వరకు ‘రైల్ రోకో’ కొనసాగుతుందని కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ప్రకటించింది. అమృత్‌సర్‌తోపాటు పలు ప్రాంతాల్లో రైతుల ‘రైల్ రోకో’ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకునే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు.