Railway Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో రైల్వేలో ఉద్యోగం

సదరన్ రైల్వే జోన్ పరిధిలోని పెరంబూర్, పొడనూర్‌లోని వర్క్‌షాపుల్లో 3వేల 378 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందు కోసం మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదల చేసింది.

Railway Jobs : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్ అర్హతతో రైల్వేలో ఉద్యోగం

Railway Jobs

Updated On : June 15, 2021 / 3:21 PM IST

Railway Jobs : సదరన్ రైల్వే జోన్ పరిధిలోని పెరంబూర్, పొడనూర్‌లోని వర్క్‌షాపుల్లో 3వేల 378 అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇందు కోసం మూడు నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదల చేసింది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, వైర్‌మ్యాన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టర్నర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది.

అభ్యర్థులు జూన్ 30 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పుదుచ్చెరీ, అండమాన్ నికోబార్, లక్షద్వీప్ కేంద్ర పాలిత ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలు, కర్నాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలకు చెందిన వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. టెన్త్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. అభ్యర్థుల వయస్సు 15 నుంచి 24 ఏళ్ల లోపు ఉండాలి. నోటిఫికేషన్ల వివరాలకు సదరన్ రైల్వే అధికారిక వెబ్‌సైట్ https://sr.indianrailways.gov.in/ను చూడాలి.