Raj Thackeray, Annamalai (Image Credit To Original Source)
Raj Thackeray: ముంబైలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ థాకరే వివాదాస్పద కామెంట్లు చేశారు. ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ అని నినాదం చేశారు. మరాఠా భూమి పుత్రులదే ముంబై అని అన్నారు.
స్థానికులకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యం ఉండాలని రాజ్ థాకరే చెప్పారు. బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలైను రసమలై అంటూ రాజ్ థాకరే చురకలు అంటించారు. ఆయన ముంబైకు వస్తే కాళ్లు నరికేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
కాగా, ముంబైలో అవకాశాలన్నీ సౌతిండియావారే దక్కించుకుంటున్నారంటూ 1960 దశకంలో బాల్ థాకరే ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ పిలునిచ్చారు. స్థానికంగా ఉండేవారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కడంలేదని అన్నారు.
Also Read: Skill Development Case: చంద్రబాబుతో పాటు మొత్తం 37 మందిపై విచారణ క్లోజ్
అప్పట్లో ఆయన ఇచ్చిన ఆ నినాదం మరాఠా యువతను బాగా ఆకర్షించింది. మళ్లీ ఇప్పుడు ‘హటావో లుంగీ, బజావో పుంగీ’ అంటూ రాజ్ థాకరే నినాదం ఇవ్వడం గమనార్హం.
దీనిపై అన్నామలై స్పందిస్తూ.. రాజ్ థాకరే వార్నింగ్‌లకు తాము భయపడబోమని చెప్పారు. తాను ముంబైకి వచ్చి తీరుతానని తెలిపారు. తన కాళ్లను ఎవరు నరుకుతారో చూస్తానని అన్నారు.
ఇటీవల అన్నామలై ముంబై గురించి మాట్లాడుతూ.. ముంబై అంటే మహారాష్ట్ర రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థిక రాజధాని అని అన్నారు. ఇది ఒక ఇంటర్నేషనల్ సిటీ అని చెప్పారు. ఆ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ రూ.40 కోట్లు అని గుర్తుచేశారు. దాని బాధ్యతను నిజాయితీపరుడికి అప్పగించాలని ఓటర్లకు చెప్పారు.