రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోత్ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు బీజేపీ రెడీ అయింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడుతున్నట్టు కాషాయ పార్టీ ప్రకటించింది. రేపు అవిశ్వాసంపై నోటీసు ఇవ్వనుంది. 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి 120 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీకి 72 మంది సభ్యుల బలం ఉంది. మిగిలిన వారు ఇతర పార్టీల
రేపటి నుంచి రాజస్తాన్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కరోనా వైరస్ మీద చర్చిస్తామని ముఖ్యమంత్రి గెహ్లోత్ గవర్నర్ మీద పదే పదే ఒత్తిడి చేయడంతో చివరకు అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ కార్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రోజు రాజస్థాన్‌లోని బీజేపీ అగ్రనేతలు, మాజీ సీఎం వసుంధరా రాజే లాంటి వారు సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల మీద చర్చించారు. ప్రభుత్వం మీద అవిశ్వాసం పెట్టాలని నిర్ణయించారు.
జూలైలో కాంగ్రెస్ పార్టీలో చీలిక ఏర్పడిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశ కావడం ఇదే తొలిసారి కావడం విశేషం. మేం రేపు అసెంబ్లీలో ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం అని రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత గులాబ్ చంద్ కటారియా చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారమే సమావేశం కావాలనుకున్నారు. అయితే, అందుకు ఒక్కరోజు ముందే సచిన్ పైలెట్ వర్గం మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిపోవడంతో ఆ భేటీని రద్దు చేసుకున్నారు.
అయితే, సడన్‌గా మీటింగ్ రద్దు చేసుకోవడం గురించి సీఎం గెహ్లోత్ బీజేపీ మీద సెటైర్లు వేశారు. వాళ్లకు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు. వాస్తవానికి రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంక్షోభం ముగిసింది. అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం మీద ఎదురుతిరిగిన సచిన్ పైలెట్ వర్గం మళ్లీ తాపీగా వెనక్కి వచ్చింది. దీంతో కథ ముగిసిందనుకున్నారు. కానీ, ఇంతలో బీజేపీ ఈ విధంగా ట్విస్ట్ ఇచ్చింది.
.