Rajasthan Omicron : రాజస్థాన్‌లో ఒమిక్రాన్ మరణం.. కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతి

రాజస్థాన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. రాష్ట్రంలోని ఉదాయ్ పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యూమోనియాతో ప్రాణాలు కోల్పోయాడు.

Rajasthan Omicron : రాజస్థాన్‌లో ఒమిక్రాన్ వేరియంట్ బారినపడి కోలుకున్న 73ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. రాష్ట్రంలోని ఉదాయ్ పూర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ న్యూమోనియాతో ప్రాణాలు కోల్పోయాడు. ఒమిక్రాన్ సోకిన వృద్ధుడికి ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తర్వాత న్యూమోనియాతో మరణించినట్టు CHMO ఉదాయ్ పూర్ దినేశ్ ఖరాడీ పేర్కొన్నారు. మృతుడికి డిసెంబర్ 21, డిసెంబర్ 25న రెండు సార్లు కోవిడ్ టెస్టింగ్ నిర్వహించగా.. నెగటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు. జీనోమ్ సీక్వెన్స్ కలిగి ఉండటంతో అతడికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందని తెలిపారు.

వృద్ధుడు కోమార్బిటీలు కలిగి ఉండటంతో పాటు అతడికి డయాబెటిస్, హైపర్ టెన్షన్, హైపోథైరాయిడిజం వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నాయని ఉదాయ్ పూర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ దినేశ్ వెల్లడించారు. డిసెంబర్ 15న బాధితుడికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, అతడిలో జ్వరం, దగ్గుతో పాటు ముక్కుకారటం వంటి లక్షణాలు ఉండటంతో ఆస్పత్రిలో చేరినట్టు తెలిపారు.

లక్షణాల ఆధారంగా అతడి నుంచి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్స్ కోసం ల్యాబ్ కు పంపినట్టు పేర్కొన్నారు. డిసెంబర్ 25న వచ్చిన రిపోర్టులో అతడికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయింది. డిసెంబర్ 21న అతడికి కోవిడ్ టెస్టు చేయగా నెగటివ్ వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ 25న రెండోసారి కోవిడ్ టెస్టు నిర్వహించగా.. అప్పుడు కూడా నెగటివ్ నిర్ధారణ అయినట్టు CHMO తెలిపారు.

Read Also : US Covid Cases : అమెరికాలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 5లక్షల 80వేల కేసులు

ట్రెండింగ్ వార్తలు