Child marriage : బాల్య వివాహాలను చట్టబద్ధం చేసిన రాజస్థాన్..

రాజస్థాన్ ప్రభుత్వం బాల్య వివాహాల బిల్లును చట్టబద్దం చేసింది. బాల్య వివాహాలు రిజస్ట్రేషన్ చేసేలా అసెంబ్లీలో బిల్ పాస్ చేసింది.

Rajasthan Assembly amends marriage registration law : బాల్య వివాహాలు దురాచార, నేరం. బాల్యవివాహాలు చట్ట వ్యతిరేకం. కానీ రాజస్థాన్ లో మాత్రం ఇకనుంచి బాల్య వివాహాలు యదేచ్చగా చేసుకోవచ్చు.ఎందుకంటే ప్రభుత్వం బాల్య వివాహాలను చట్టబద్ధం చేసింది. అంతేకాదు బాల్య వివాహాలు చేసేవారు చేసుకునేవారు కూడా అధికారికంగా నమోదు చేసుకోవచ్చని కూడా తెలిపింది.బాల్య వివాహం జరిగికా నెల రోజుల లోపు వివరాలు తెలపాలని పేర్కొంది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ కూడా ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. బాల్య వివాహాలను అడ్డుకోవాల్సిన ప్రభుత్వమే ఇలా చట్టబద్ధం చేస్తే పరిస్థితి ఏంటీ? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Read more : బాల్య వివాహాలల్లో టాప్-4లో భారత్..ఫస్ట్ ప్లేస్ లో బంగ్లాదేశ్ : UNICEF

ఓపక్క బాల్య వివాహాలను అరికట్టటానికి ఉద్యమాలు నడుస్తుంటే.. మరోపక్క వాటిని అడ్డుకోవాల్సిన ప్రభుత్వాలే..చట్ట బద్ధం చేస్తే పరిస్థితేంటి? అనే కొత్త పరిస్థితిని క్రియేట్ చేసింది రాజస్థాన్ ప్రభుత్వం. బాల్య వివాహాలకు చట్టబద్ధతను కల్పించింది. పిల్లలకు చేసే పెళ్లిళ్లను నమోదు చేసేలా రాజస్థాన్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ (సవరణ) బిల్లు 2021ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.2009 సంవత్సరం బిల్లులో మార్పులు చేస్తు ఆ బిల్లును 2021 తాజా అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టగా ఆ బిల్లు పాసైంది.

ఈ బిల్లు ప్రకారం..మైనర్లకు పెళ్లి చేస్తే.. నెలలోపు ఆ వివరాలను అధికారులకు వారి తల్లిదండ్రులు తెలియజేయాల్సి ఉంటుంది. అంటే బాల్య వివాహాన్ని నమోదు చేయాలి. దీనిపై బీజేపీ సహా ఆ రాష్ట్ర విపక్షాలు మండిపడుతున్నాయి. బాల్యవివాహాలకు రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరమేంటని తీవ్రంగా ప్రశ్నించాయి. సభ నుంచి వాకౌట్ చేశాయి. ఈ బిల్లు పాసైన ఈ రోజు బ్లాక్ డే అంటూ బీజేపీ ఎమ్మెల్యే అశోక్ లహోటీ మండిపడ్డారు. చట్టసవరణ చేయడం ద్వారా బాల్య వివాహాలను చట్టబద్ధంగా అనుమతిస్తున్నారా? అని ప్రశ్నించారు.

Read more : దారుణం : 5 ఏండ్ల గిరిజన బాలికపై అత్యాచారం

కానీ వీటిని ప్రభుత్వం తోసిపుచ్చుతోంది. దీనిపై రాష్ట్ర శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శాంతి ధరివాల్ మాట్లాడుతు..‘‘బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నట్టు సవరణలో ఎక్కడా చెప్పలేదనీ.. వివాహం తర్వాత..రిజిస్ట్రేషన్ మాత్రం కంపల్సరీ అని బిల్లు చెబుతోందనీ.. వాదిస్తున్నారు. భర్త చనిపోయిన (వితంతువులు)మహిళలకు ప్రభుత్వ ఫలాలు అందాలంటే మ్యారేజ్ సర్టిఫికెట్ తప్పనిసరి అని..అందుకే పెళ్లి నమోదను తప్పనిసరి చేశామని తెలిపారు.

కాగా..2009 చట్టంలోని సెక్షన్ 8 సవరణపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీనిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. వివాహాల తప్పనిసరి రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం..వివాహ సమయంలో అమ్మాయి వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ మరియు అబ్బాయి వయస్సు 21 కన్నా తక్కువ ఉంటే, ఆమె తల్లిదండ్రులు 30 రోజుల్లోపు రిజిస్ట్రేషన్ అధికారికి తెలియజేయాలి. కానీ రాజస్థాన్ ప్రభుత్వం చేసిన ఈ బిల్లులో బాల్య వివాహాలకు చట్టబద్ధత కల్పించినట్లుగానే ఉంది.కానీ బిల్లు ఉద్ధేశం అది కాదని ప్రభుత్వం అంటోంది.

ట్రెండింగ్ వార్తలు