Rajasthan : కొడుకు కావాలని కోరిక, ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చిన మహిళ .. అయినా ఆందోళనలో దంపతులు

కొడుకు కావాలని తపన పడిన మహిళలకు ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చింది. అయినా ఆ దంపతుల ఆందోళన పడుతున్నారు ఎందుకంటే..

Rajasthan : కొడుకు కావాలని కోరిక, ముగ్గురు మగపిల్లలకు జన్మినిచ్చిన మహిళ .. అయినా ఆందోళనలో దంపతులు

rajasthan Women ones again three sons in one birth

Updated On : December 21, 2022 / 11:42 AM IST

Rajasthan : వంశోధ్దారకుడు కావాలనే కోరికతో ఓ మహిళ తనకు అప్పటికే ముగ్గురు ఆడపిల్లలకు తల్లి అయ్యింది. కానీ కొడుకు కావాలనే ఆశ ఆకాంక్ష పోలేదు. భర్త సంపాదన అంతంత మాత్రమే. అయిన కొడుకు కావాలి. ఆ కోరికతోనే రాజస్థాన్ లోని దుంగార్పూర్ జిల్లా సగ్వాడ ప్రాంతంలో దంపతులు ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు..ఒక్క కొడుకు లేడే అని తెగ బాధపడిపోయేవారు. మరో కాన్పులో అయినా మగబిడ్డ పుట్టాలనే ఆశతో గర్భం ధరించిందా ముగ్గురు ఆడపిల్లల తల్లి. ఆ దంపతులు ఆశపడినట్లుగానే మగపిల్లలు పుట్టారు. ఒక్కరు కాదు ఒకే కాన్పులో ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ఆ బిడ్డలను చూసి ఆ దంపతులకు ఓ పక్క సంతోషం మరోపక్క ఆందోళన..అదేంటీ మగపిల్లాడు కావాలనే వారి కోరిక నెరవేరింది కదా..పైగా ముగ్గురు మగపిల్లలు పుట్టారు కదా ఇంకా బాధేంటీ అనుకోవచ్చు..ఇక్కడే నుంచే మొదలైంది అసలు సమస్య అంతా..

సగ్వాడ ప్రాంతానికి చెందిన బడు, జయంతిలాల్ దంపతులు.వారికి ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. కానీ కొడుకు కావాలని ఆశపడ్డారు. అంతంతమాత్రమే ఆదాయం. అయినా కొకుడు కోసం ఆరాటం. అలా ఒక్క కొడుకు పుడితే చాలు అని మరోసారి గర్భం దాల్చింది బడు. వారి కోరిక దేవుడు బాగా విన్నట్టున్నాడు. నవంమర్ 26(2022) ఒక్కరు కాదు ఏకంగా ముగ్గురు మగపిల్లలు పుట్టారు. ముగ్గురు పిల్లలు నెలలు నిండకుండా జన్మించడం డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉండాలన్నారు. అలా బిడ్డల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడటంతో 25 రోజుల తరువాత తల్లీని పిల్లలను డిశ్చార్జ్ చేశారు డాక్టర్లు.

ఇక అక్కడనుంచే ప్రారంభమయ్యాయి ఈ దంపతులకు కష్టాలు. అప్పటికే ఉన్న ముగ్గురు ఆడపిల్లలను..ఆశ పడి కన్న ముగ్గురు మగపిల్లలను పోషించటానికి జయంతిలాల్ నానా పాట్లు పడుతున్నాడు. అంతంత మాత్రం సంపాదన..పెరిగిన ఖర్చులు దీంతో సంసారం నడపటం కష్టమైపోయింది. కోరి కోరి కన్న కొడుకులను చూసి మురిసిపోవాలో..మొత్తం ఆరుగురు పిల్లలను ఎలా పోషించలేక బాధపడాలో అర్థం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు ఆ దంపతులు. అందుకే అంటారు పెద్దలు మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందని..పెద్దలు చెప్పిన సామెతలు ఊరికే పోవు..సామాజిక పరిస్థితులకు అద్దం పడుతుంటాయి సామెతలు అని మరోసారి తెలుస్తోంది.