Rajya Sabha polls : రాజ్యసభ ఎలక్షన్స్.. ఉత్తర ప్రదేశ్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో క్రాస్ ఓటింగ్ టెన్షన్..

ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే.

Rajya Sabha Election 2024

Rajya Sabha Elections 2024 : దేశంలోని కర్ణాటక, యూపీ, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో 15 రాజ్యసభ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. సాయంత్రం 5గంటలకు పలితాలు వెల్లడికానున్నాయి. అయితే మూడు రాష్ట్రాల్లోనూ క్రాస్ ఓటింగ్ టెన్షన్ రాజకీయ పార్టీలను వెంటాడుతోంది. ఇప్పటికే రాజ్యసభ ఎన్నికలకోసం ఆయా పార్టీలు విప్ జారీ చేశాయి. ఉత్తప్రదేశ్ లో బీజేపీ అదనంగా మరొకరినీ బరిలోకి దింపింది. ఏప్రిల్  2, 3 తేదీల్లో రాజ్యసభలో 56 మంది సభ్యుల పదవీకాలం ముగుస్తున్న విషయం తెలిసిందే. అయితే, దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో 41 స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మిగిలిన 15 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.

Also Read : ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ రెండు గ్యారెంటీ స్కీంల ప్రారంభంలో ట్విస్ట్

యూపీలో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 11 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఎనిమిది మంది బీజేపీ అభ్యర్థులు ఉండగా, ముగ్గురు ఎస్పీ అభ్యర్థులు ఉన్నారు. కర్ణాటక నుంచి రాజ్యసభ బరిలో ఐదుగురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వారిలో ముగ్గురు కాంగ్రెస్ నుంచి, బీజేపీ, జేడీఎస్ ల నుంచి ఒక్కొక్కరు పోటీ చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఒక్క స్థానంకు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

Also Reada : YS Jagan: దశాబ్దాల సమస్యకు శుభంకార్డు.. 106 చెరువులకు కృష్ణాజలాలు

ఏపీలో మూడు, తెలంగాణలో మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయిన విషయం తెలిసిందే. ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలు వైసీపీకి దక్కాయి. వైసీపీ నుంచి మేడా శివనాధ్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలంగాణ నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు కాంగ్రెస్ నుంచి రేణుకాచౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు.

 

 

ట్రెండింగ్ వార్తలు