ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ రెండు గ్యారెంటీ స్కీంల ప్రారంభంలో ట్విస్ట్

రెండు గ్యారెంటీ పథకాలను చేవెళ్లలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా

ఎన్నికల కోడ్ ఎఫెక్ట్.. తెలంగాణ సర్కార్ రెండు గ్యారెంటీ స్కీంల ప్రారంభంలో ట్విస్ట్

Congress Guarantees,

CM Revanth Reddy : అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లోని హామీల్లో మరో రెండింటిని మంగళవారం నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. మంగళవారం సాయంత్రం 4గంటలకు రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించాల్సి ఉంది. బహిరంగ సభలో రెండు హామీల అమలు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ ప్రారంభిస్తారని ప్రభుత్వంసైతం తెలిపింది. అయితే, ఈ రెండు గ్యారెంటీ పథకాలైన ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500 గ్యాస్ సిలీండర్ ప్రారంభంలో ట్విస్ట్ చోటు చేసుకుంది.

Also Read : Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీకి చిక్కులు

రెండు గ్యారెంటీ పథకాలను చేవెళ్లలో ప్రారంభించాలని ప్రభుత్వం భావించినప్పటికీ ఎన్నికల కోడ్ అడ్డువచ్చింది. కేంద్ర ఎన్నికల సంఘం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రాంతంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని షాద్ నగర్ ప్రాంతం.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ కారణంగా రెండు గ్యారెంటీ స్కీంలను ప్రారంభించేందుకు వీలులేకుండా పోయింది. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రెండు గ్యారెంటీ స్కీంలను సచివాలయంలోనే ప్రారంభించాలని నిర్ణయించింది.

Also Read : బీజేపీ 420 పార్టీ.. చీటింగ్ కేసు పెట్టాలి: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి

ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రూ. 500కే గ్యాస్ సిలీండర్ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం సాయంత్రం చేవెళ్లలో జరిగే రాజకీయ సభలో రేవంత్ పాల్గొని మాట్లాడతారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీల్లోని ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఒక్కో స్కీంను ప్రారంభిస్తుంది. ఇప్పటికే పలు స్కీంలను ప్రారంభించిన ప్రభుత్వం.. ఇవాళ మరో రెండు స్కీంలను ప్రారంభించనుంది.