బదిలీ వేటు : సీబీఐ నుండి ఆస్థానా అవుట్

  • Published By: veegamteam ,Published On : January 18, 2019 / 04:01 AM IST
బదిలీ వేటు : సీబీఐ నుండి ఆస్థానా అవుట్

ఢిల్లీ : అవినీతి రగడతో నడివీధిన పడిన సీబీఐలో గత కొంతకాలంలో కీలక పరిణామాలు జరుగుతున్నాయి. డైరెక్టర్ ఆలోక్‌ వర్మకు ఉద్వాసన పలకగా..ఇప్పుడు  తాజాగా స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానాపై కూడా వేటు పడింది. ఆస్థానాపై ట్రాన్సఫర్ వేటుతో పాటు పదవీ కాలాన్ని కూడా తగ్గించివేసింది కేంద్ర ప్రభుత్వం.  అస్థానాతో పాటు జాయింట్‌ డైరెక్టర్‌ అరుణ్‌ కుమార్‌శర్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ మనీశ్‌కుమార్‌ సిన్హా, సూపరిటెండెంట్‌ ఆఫ్ పోలీస్‌ జయంత్‌ జె. నైక్నవరే పదవీ కాలాలను కుదిస్తున్నట్లు గురువారం (జనవరి 17న) సంబంధిత డిపార్ట్ మెంట్ తెలిపింది. ఈ క్రమంలో ఆస్థానాను సీబీఐ నుంచి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ కు ట్రాన్సఫర్ చేసింది. 

సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానాల మధ్య తలెత్తిన వివాదాలు..అవినీతి ఆరోపణలు వచ్చిన క్రమంలో వీరిద్దరిని బలవంతపు సెలవుపై పంపించటం..దీనిపి అలోక్ వర్మ సుప్రీంకోర్టులో పిటీషన్ వేయటం..అలోక్ వర్మను తిరిగి సర్వీస్ లోకి తీసుకోవాలని సుప్రీం తీర్పునివ్వటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అలోక్ వర్మను తిరిగి సీబీఐ డెరెక్టర్ గా నియమించింది కేంద్ర ప్రభుత్వం.ఈ క్రమంలో మరోసారి  అలోక్ వర్మను డైరెక్టర్ పదవి నుండి తప్పించి మన్నెం  నాగేశ్వరరావుకు తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించటమే కాక డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ అండ్ హోమ్ గార్డ్స్‌కు అలోక్ వర్మను బదిలీ చేశారు. దీంతో అలోక్ వర్మ తీవ్ర మనస్థాపానికి గురై రాజీనామా చేశారు. ఈ క్రమంలో అలోక్ వర్మను తప్పించిన కేంద్రం అస్థానాపై వేటు వేయకుంటే మరోసారి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందనే యోచనతో ఆస్థానాపై కూడా బదిలీ వేటు వేసిందనేది కొందరి విశ్లేషణ.