పౌరసత్వ చట్టానికి మద్దతుగా…నాగ్ పూర్ లో భారీ ర్యాలీ

పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా… నాగ్‌పుర్‌లో భాజపా, ఆర్​ఎస్​ఎస్​ , లోక్‌ అధికార్ మంచ్‌, పలు ఇతదర ఆర్గనైజేషన్లు కలిసి భారీ భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో హాజరైన మద్దతుదారులు భారీ జాతీయ జెండాను చేతపట్టుకుని ముందుకు సాగారు. పౌరసత్వ చట్టానికి అనుకూలంగా నినాదాలు చేశారు. స్థానిక యశ్వంత్ స్టేడియం నుంచి సంవిధాన్ చౌక్ వరకూ ఈ ర్యాలీ జరిగింది. ముంబైలోనూ పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా పలుచోట్ల భారీ ర్యాలీలు, ప్రదర్శనలు నిర్వహించారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా హింసాత్మక ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో ఈ చట్టానికి మద్దతు తెలుపుతూ పలుచోట్ల ర్యాలీలు నిర్వహిస్తుండటం విశేషం.

ఈశాన్యరాష్ట్రాలతో పాటుగా,ఢిల్లీ,ఉత్తరప్రదేశ్,కర్ణాటక సహా పలుచోట్ల పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు,నిరసనలు కొనసాగుతున్నాయి. యూపీలో ఆందోళనలో పాల్గొని పోలీసులు కాల్పుల్లో 11మంది మరణించగా,కర్ణాటకలోని మంగళూరులో ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పలుచోట్ల ఇప్పటికీ ఇంటర్నెట్ ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు