Ram Janmabhoomi temple
Ram Janmabhoomi temple : రామజన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయం భద్రత కోసం హైటెక్ 24×7 కవచ్ ను ఏర్పాటు చేయనున్నారు. వెయ్యి ఏళ్లపాటు ఉండే ఆలయంలో అత్యంత అధునాతనమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయంపై దాడులు, చొరబాట్లను అరికట్టేందుకు వీలుగా రూ.90 కోట్లతో ఫూల్ ప్రూఫ్ భద్రతా కవచాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ డైరెక్టర్ జనరల్ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఆలయంలో భద్రతా పరికరాలను అమర్చే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించామని, మరికొన్ని రోజుల్లో దీన్ని పూర్తి చేస్తామని డీజీ పేర్కొన్నారు.
ALSO READ : జాతీయ రాజకీయాలకు వేదికగా తెలంగాణ.. రాష్ట్రం నుంచి అగ్రనేతల పోటీ? మోదీ, సోనియా సై అంటారా?
ఉత్తరప్రదేశ్ రాజ్‌కీయ నిర్మాణ్ నిగమ్ భద్రతా పరికరాలను ఇన్‌స్టాల్ చేస్తోందని ఆయన తెలిపారు. ఈ గాడ్జెట్‌లలో హై-టార్గెట్ బిల్డింగ్‌లను కాన్సర్టెడ్ వెహికల్ అటాక్, అండర్-వెహికల్ స్కానర్ నుంచి రక్షించడానికి రూపొందించిన క్రాష్-రేటెడ్ బోలార్డ్‌లు ఉన్నాయి. అయోధ్యలోని రామ మందిరాన్ని కాపాడేలా ఆర్టిఫిషియల్ నిఘా ఏర్పాటు చేస్తున్నారు. రామ మందిర భద్రతను ప్రతి ఆరు నెలలకోసారి సంబంధిత అధికారులు సమీక్షిస్తారని, భవిష్యత్తులో కూడా ఈ సమీక్ష ప్రక్రియ కొనసాగుతుందని డీజీ తెలిపారు.
ALSO READ : Prime Minister Narendra Modi : లక్షద్వీప్ ప్రెస్టిన్ బీచ్‌లో మోదీ సాహస స్విమ్మింగ్
సీసీటీవీ నిఘా వ్యవస్థతో సహా కొన్ని భద్రతా పరికరాలను ఏర్పాటు చేస్తున్నారు. యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్. క్రాష్ రేటెడ్ బోలార్డ్స్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, సెక్యూరిటీ సిబ్బందికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, యాంటీ డ్రోన్ సిస్టమ్, నైట్ విజన్ పరికరాలు, ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ డివైజ్‌లతో పాటు మరెన్నో ఇతర పరికరాలు అమరుస్తున్నట్లు ఆయన చెప్పారు. రూ.1.02 కోట్ల విలువైన భద్రతా సిబ్బంది వాహనాలను కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.
ALSO READ : అయోధ్య రాముడి గుడి ప్రత్యేకతలు
ఆలయంలో ఏదైనా చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడానికి ఈ పరికరాలు సహాయపడతాయని ఉత్తరప్రదేశ్ రాజ్‌కీయ నిర్మాణ్ నిగమ్ జనరల్ మేనేజర్ సికె శ్రీవాస్తవ చెప్పారు. జన్మభూమి మార్గం మీదుగా రోడ్డుపై వెళ్లే వాహనాన్ని వెంటనే లోపలి నుంచి స్కాన్ చేస్తారు. లోపలికి అనుమతించని వస్తువును తీసుకెళ్తుంటే, వాహనాన్ని ఆపివేస్తారని డీజీ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 135 స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండోల ప్రత్యేక యూనిట్ ఏర్పాటు చేశారు.
ALSO READ : Telangana : తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
అయోధ్యలో ఏటీఎస్ స్పెషల్ పోలీస్ ఆపరేషన్ టీమ్స్ 16 బృందాలను మోహరించారు. అగ్నిమాపక పరికరాల కొనుగోలు కోసం ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణానికి రూ 1.44 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. అయోధ్యలోని సరయూ ఘాట్‌ల వద్ద భక్తుల భద్రతకు వాటర్ పోలీస్ సిబ్బంది భరోసా కల్పిస్తారు. రూ.2.84 కోట్లతో పలు నదీ పరికరాలను అమర్చారు.