Bride Refused Groom : ఏడడుగులు నడిచాక వరుడు నచ్చలేదని పీటల మీదనుంచి వెళ్లిపోయిన వధువు
జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్ని చుట్టూ ఏడడగులు నడిచినా తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పీటల మీదనుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది.

Ranchi Bride Refuses To Get Married After Saat Pheras
Bride Refused Groom : ఇటీవలి కాలంలో పీటల మీద ఆగిపోతున్నపెళ్లిళ్ల వార్తలు తరచూ వింటున్నాము. తమిళనాడులో తాళి కట్టే ముందు వరుడు నచ్చలేదని ఓ యువతి పీటల మీద నుంచి లేచిపోగా… మరోక చోట వరుడు తాగి వచ్చాడని అతడ్ని చేసుకోటానికి నిరాకరించింది మరోక యువతి. ఇలాంటి సంఘటనలు ఇటీవల దేశవ్యాప్తంగా ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో అగ్ని చుట్టూ ఏడడుగులు నడిచిన తర్వాత వరుడు నచ్చలేదంటూ వధువు పీటల మీదనుంచి వెళ్లిపోయిన ఘటన చోటు చేసుకుంది. వరుడు వినోద్ కు, వధువు చందా కు పెద్దలు వివాహం నిశ్చయించారు. జూన్ 29, మంగళవారం ముహూర్తం నిర్ణయించుకున్నారు. మగ పెళ్లి వారు కళ్యాణ మండపానికి వచ్చారు.
పెళ్లి కార్యక్రమం మొదలయ్యింది. అందులో భాగంగా వధూవరులిద్దరూ అగ్ని చుట్టూ ఏడు ప్రదక్షిణాలు చేశారు. తర్వాత వారి ఆచారం ప్రకారం సింథూర్ దాన్ కార్యక్రమం జరగాల్సి ఉంది. పురోహితుడు అందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఉన్నట్టుండి వధువు పెళ్లిపీటల మీద నుంచి లేచి మండపం దిగి వెళ్లిపోయింది. వధువు తల్లితండ్రులు ఆమెకు ఎంత నచ్చచెప్పినా వినలేదు.
దీంతో వధువు తండ్రి వివాహాన్ని రద్దు చేసుకుంటున్నట్లు చెప్పాడు. వరుడి తరుఫు బంధువులు పెళ్లి మండపంలో నిరసనకు దిగారు. తమకు ఇప్పటి దాకా అయిన పెళ్లి ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బులేదని పెళ్లి కూతురు తండ్రి వారికి సర్ధి చెప్పటంతో నిరసన విరమించి వాళ్ల ఇంటికి తిరిగి వెళ్లారు.