హత్రాస్ హత్యాచారం : 96గంటల్లో పరీక్షించాలి.. 11రోజులకు చేస్తే ఎలా?.. నిపుణులు ఏం అంటున్నారు?

  • Published By: vamsi ,Published On : October 5, 2020 / 08:47 PM IST
హత్రాస్ హత్యాచారం : 96గంటల్లో పరీక్షించాలి.. 11రోజులకు చేస్తే ఎలా?.. నిపుణులు ఏం అంటున్నారు?

Updated On : October 5, 2020 / 9:01 PM IST

హత్రాస్ హత్యాచారం కేసులో ఫోరెన్సిక్ నివేదికలో బాధితురాలిపై అత్యాచారం జరగలేదని వచ్చింది. దీనిపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఆగ్రాకు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్) తుది నివేదికలో, టెస్టింగ్‌కు వచ్చిన నమూనాలో స్పెర్మ్ కనుగొనలేదు. అంతేకాదు సంభోగానికి సంబంధించిన సంకేతాలు కూడా అందులో లేవు.



అయితే, ఇప్పుడు ఈ నివేదికను నిపుణులు ప్రశ్నిస్తున్నారు. బాధితురాలి నమూనాలను 11 రోజుల తర్వాత దర్యాప్తు కోసం పంపించగా, అన్ని రోజుల తర్వాత స్పెర్మ్ నమూనాల్లో రావడం చాలా కష్టమని వారు చెబుతున్నారు. ఈ విషయంలో పోలీసుల, ప్రభుత్వ నిర్లక్ష్యం ఎక్కువగా కనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.

-సెప్టెంబర్ 22న తీసిన నమూనా, ల్యాబ్‌కు సెప్టెంబర్ 25న వచ్చింది
-ఈ నివేదిక ఆధారంగా పోలీసులు అత్యాచారం జరగలేదని చెబుతున్నారు.
-ఇతర నిపుణులు కూడా ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికపై ప్రశ్నలు సంధించారు
-ప్రారంభ మెడికో-లైగర్ నివేదిక ఏం చెబుతుంది?



సెప్టెంబర్ 22 న తీసిన నమూనా, ల్యాబ్ సెప్టెంబర్ 25 న వచ్చింది

సెప్టెంబర్ 14 న సామూహిక అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత బాలిక గురించి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం (AMU) ఆసుపత్రిలో ఇచ్చిన ప్రకటనలో సెప్టెంబర్ 22 న స్పృహ తిరిగి వచ్చిన తరువాత , ఆమె స్టేట్మెంట్ మేజిస్ట్రేట్ ముందు రికార్డ్ చేయబడింది. పోలీసులు అత్యాచారంకు సంబంధించిన కేసుగా ఎఫ్ఐఆర్‌లో చేర్చారు.

బాధితురాలి ప్రకటన తరువాత, ఆమె నమూనా ఎఫ్‌ఎస్‌ఎల్ దర్యాప్తు కోసం ఆగ్రాకు పంపబడింది, అది సెప్టెంబర్ 25న అక్కడకు చేరుకుంది.



ఈ నివేదిక ఆధారంగా పోలీసులు అత్యాచారం చేయలేదని చెబుతున్నారు.

అదే నివేదికలో, బాధితురాలి నమూనాలో స్పెర్మ్ కనుగొనబడలేదు. అంతేకాదు సంభోగం ఆధారాలు కూడా లేవు. దీని ఆధారంగా బాధితురాలిపై అత్యాచారం జరగలేదని ఉత్తర ప్రదేశ్ పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (ఎడిజి) ప్రశాంత్ కుమార్ తెలిపారు .

కుల ఉద్రిక్తతలను పెంచడానికి కొంతమంది ఈ కేసును ఎంచుకున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన విలేకరుల సమావేశంలో చెప్పుకొచ్చారు.

అయితే, ఇప్పుడు చాలా మంది నిపుణులు ఈ ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికను ప్రశ్నిస్తున్నారు.



Aligarh Muslim University(AMU), జవహర్‌లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీకి చెందిన చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సిఎంఓ) డాక్టర్ అజీమ్ మాలిక్ ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ, “మహిళపై అత్యాచారం జరిగిన 11 రోజుల తరువాత నమూనాలను సేకరించారు, అయితే ప్రభుత్వ మార్గదర్శకాలు స్పష్టంగా 96 గంటల్లోపు అత్యాచారానికి ఫోరెన్సిక్ ఆధారాలు తీసుకుంటేనే నమూనాల్లో వస్తుంది. ఈ సంఘటనలో అత్యాచారం నివేదికలు నిర్ధారించలేవు.” అని అన్నారు.

ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ హమ్జా మాలిక్ కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదికను నమ్మదగనిదిగా పేర్కొన్నారు. “11 రోజుల తరువాత అత్యాచారానికి సంబంధించిన ఆధారాలను ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఎలా కనుగొంటుంది? రెండు లేదా మూడు రోజుల తర్వాత స్పెర్మ్‌లు జీవించవు. మూత్ర విసర్జన, మలవిసర్జన మరియు రుతుస్రావం కారణంగా జుట్టు, దుస్తులు, వేలుగోళ్లు మరియు యోని మరియు ఆసన కుహరాల నుంచి నమూనాలను తీసుకున్నారు.” వాటిలో వీర్యం కనిపించడం కష్టం.”



అయితే ప్రారంభ మెడికో-లైగర్ నివేదికలో మాత్రం.. బాధితురాలి మెడికో-లీగల్ పరీక్ష ఫలితాలు కూడా FSL నివేదికకు విరుద్ధంగా ఉన్నాయి. దీనిలో, బలప్రయోగానికి ఆధారాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తు ఆధారంగా డాక్టర్ తాత్కాలిక అభిప్రాయం ఇచ్చారు. ఈ నివేదికలో, మహిళ ప్రకటన ఆధారంగా, యోని చొచ్చుకుపోయినట్లుగా కూడా చెప్పబడింది. హత్రాస్ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంత సంచలనం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.