Crime News: పంజాబ్ లోని చండీఘడ్ లో దారుణం జరిగింది. 13 ఏళ్ల బాలికపై 18 ఏళ్ళ కజిన్ అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం ధరించింది. ఈ విషయం ఎవరికీ తెలియకూడదని మైనర్ బాలిక గర్భం ధరించటం ఇష్టం లేని యువకుడి తల్లి తండ్రులు బాలికకు అబార్షన్ చేయించాలని పట్టు బట్టారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ మొదలుపెట్టారు.
చండీఘడ్ లో మామయ్య ఇంటికి వచ్చిన 13 ఏళ్ళ బాలికపై అక్కడే ఉంటున్న ఆమె మేనమామ కొడుకు అత్యాచారం చేశాడు. ఫలితంగా బాలిక నెల తప్పింది. ఈ విషయం తెలిసిన మేనమామ, అమ్ముమ్మ, తాతయ్య బాలికకు అబార్షన్ చేయించాలని ప్రయత్నించారు. ఈ విషయం ఎవరికీ చెప్పోద్దని బాలికను బెదిరించారు.
ఈ లోగా బాలికను చూడటానికి ఆమె తల్లి పుట్టింటికి వచ్చ్దింది. బాలిక తనపై జరిగిన అత్యాచారాన్ని తల్లికి వివరించింది.వెంటనే ఆమె పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376 (అత్యాచారం), 313 (అమ్మాయి సమ్మతిలేకుండా అబార్షన్ చేయించడం) తోపాటు POCSO Act ప్రకారం కేసులు నమోదు చేశారు. అత్యాచార నిందితుడు, అతని పేరెంట్స్, తాత అమ్ముమ్మలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.