RBI Governor tests positive for COVID-19 రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)గవర్నర్ శక్తికాంతదాస్ కి కరోనా వైరస్ సోకింది. శక్తికాంత్ దాస్ స్వయంగా ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు.
తనకు కరోనా పాజిటివ్ వచ్చినప్పటికీ తనలో రోగ లక్షణాలు లేవని..ప్రస్తుతం చాలా బాగున్నానని ట్వీట్ లో ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలిసివాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఐసొలేషన్ నుంచి తాను తన వర్క్ ని కంటిన్యూ చేయనున్నట్లు శక్తికాంతదాస్ తెలిపారు. ఆర్బీఐలో పని ఎప్పటిలానే కొనసాగుతుంటుందని తెలిపారు. అందరూ డిప్యూటీ గవర్నర్లతో, ఇతర అధికారులతో తాను టచ్ లో ఉన్నట్లు తెలిపారు. ఫోన్ లో,వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడుతున్నట్లు శక్తికాంత్ దాస్ చెప్పారు.
63ఏళ్ల శక్తికాంతదాస్ ప్రస్తుతం 25వ ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగుతున్నారు. ఆర్థికవ్యవస్థను గాడిలో ఉంచేందుకు లాక్ డౌన్ సమయంలో మరియు అన్ లాక్ తర్వాత చాలా యాక్టివ్ గా పనిచేస్తూ వచ్చారు శక్తికాంతదాస్. కరోనా సంక్షోభం నుంచి ఆర్థికవ్యవస్థ కోలుకునేందుకు పలు కీలక నిర్ణయాలను ప్రకటించారు.
కాగా,ఆదివారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 78లక్షలు దాటింది. అయితే,దేశంలో కరోనా రికవరీ రేటు 90శాతానికి చేరుకోవడం ఒకింత ఊరట కలిగించే విషయం. ప్రస్తుతం దేశంలో 6లక్షల 68వేల 154 యాక్టీవ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అంటే మొత్తం కేసులలో 8.50శాతం మాత్రమే.