Axis Bank: యాక్సిస్ బ్యాంకు రూ.25లక్షల ఫైన్ విధించిన ఆర్బీఐ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనెటరీ పెనాల్టీ కింద యాక్సిస్ బ్యాంకుకు రూ.25లక్షల జరిమానా విధించింది. సెప్టెంబర్ 1న ఆదేశాలిస్తూ.. KYCరూల్స్ అతిక్రమించినందుకు....

Axis Bank: యాక్సిస్ బ్యాంకు రూ.25లక్షల ఫైన్ విధించిన ఆర్బీఐ

Axis Bank

Updated On : September 1, 2021 / 9:49 PM IST

Axis Bank: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మోనెటరీ పెనాల్టీ కింద యాక్సిస్ బ్యాంకుకు రూ.25లక్షల జరిమానా విధించింది. సెప్టెంబర్ 1న ఆదేశాలిస్తూ.. KYCరూల్స్ అతిక్రమించినందుకు ఫైన్ కట్టాల్సిందేనని స్టేట్‌మెంట్ ఇచ్చింది.

ఫిబ్రవరి 2020, మార్చి 2020 నెలల్లో డేటాను పరిశీలించింది. ఈ మేర యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ ఆదేశాల మేర ప్రవర్తించలేదని గమనించింది. కస్టమర్ బిజినెస్, రిస్క్ ప్రొఫైల్స్ గురించి తెలిసి కూడా బ్యాంకు ప్రవర్తించిన తీరుపై అసహనం వ్యక్తం చేసింది.

యాక్సిస్ బ్యాంక్ కు నోటీసులు పంపుతూ.. ఆ అకౌంట్ పై పెనాల్టీ ఎందుకు విధించలేదని ప్రశ్నించింది. యాక్సిస్ బ్యాంకు నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో పర్సనల్ హియరింగ్ కు పిలిచింది. ‘RBI పైన పేర్కొన్న ఆదేశాలను ఉల్లంఘించడం/పాటించలేదనే ఆరోపణలు రుజువైయ్యాయని నిర్ధారణకు వచ్చి మోనిటరీ పెనాల్టీ విధించింది ఆర్బీఐ.