జనవరి 3వరకు జాగ్రత్త : ఢిల్లీలో రెడ్ అలర్ట్

దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు

  • Published By: veegamteam ,Published On : December 29, 2019 / 03:15 AM IST
జనవరి 3వరకు జాగ్రత్త : ఢిల్లీలో రెడ్ అలర్ట్

Updated On : December 29, 2019 / 3:15 AM IST

దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు

దేశ రాజధాని ఢిల్లీలో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి చంపేస్తుంది. వెన్నులో వణుకు పట్టిస్తుంది. ఎముకలు కొరికే చలితో ఢిల్లీ వాసులు వణికిపోతున్నారు. కాగా, ముందు ముందు చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. చలి తీవ్రతపై ఢిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ శాఖ. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి, దీనికి తోడు చలి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో రెడ్ అలర్ట్ జారీ చేసింది.

చలి గాలుల నుంచి జాగ్రత్తగా ఉండాలని ప్రజలను వాతావరణ శాఖ హెచ్చరించింది. 2020 జనవరి 3 వరకు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని వెల్లడించింది. డిసెంబర్ 31 తర్వాత ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. కాగా, 1930లో ఢిల్లీలో సున్నాకి ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 1992 తర్వాత ఢిల్లీలో అత్యల్పంగా 2.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఉత్తరాదిని గతంలో ఎన్నడూ లేనంతగా చలి వణికిస్తోంది. ఎముకలు కొరికే చలితో జనం గజ గజ వణికిపోతున్నారు. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గత 118 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు చేసింది. 118 ఏళ్ల తర్వాత అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఢిల్లీలో శనివారం(డిసెంబర్ 28,2019) అత్యల్పంగా 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావారణ శాఖ తెలిపింది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రమైన చలి కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

* గజగజ వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు
* ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేసిన శీతల గాలులు
* ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, యూపీ, బీహార్ లో అతిశీతల వాతావరణ పరిస్థితి నెలకొనే అవకాశం
* ఆయా రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
* 118 ఏళ్ల తర్వాత ఢిల్లీలో డిసెంబర్ నెలలో 2.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
* జమ్ముకశ్మీర్, లడఖ్ లో మైనస్ డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
* ద్రాస్ లో -28.6 డిగ్రీలు
* లేహ్ లో -19.1 డిగ్రీలు