LPG Cylinder: కొంచెం ఉపశమనం.. తగ్గిన వాణిజ్య సిలీండర్ ధర.. ఎంతంటే..

ఎల్పీజీ సిలీండర్ల కొత్త ధరలు సోమవారం విడుదలయ్యాయి. నూతన ధరల ప్రకారం.. వాణిజ్య సిలీండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్ పీజీ సిలీండర్ పై రూ. 36 తగ్గిస్తూ చమురు సంస్థలు తెలిపాయి.

LPG Cylinder: ఎల్పీజీ సిలీండర్ల కొత్త ధరలు సోమవారం విడుదలయ్యాయి. నూతన ధరల ప్రకారం.. వాణిజ్య సిలీండర్ల వినియోగదారులకు ఉపశమనం కలిగింది. 19 కేజీల ఎల్ పీజీ సిలీండర్ పై రూ. 36 తగ్గిస్తూ చమురు సంస్థలు తెలిపాయి. నేటి నుంచి తగ్గిన ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ తగ్గింపు ఢిల్లీ నుండి పాట్నా వరకు, జైపూర్ నుండి దిస్పూర్ వరకు, లడఖ్ నుండి కన్యాకుమారి వరకు అమల్లోకి రానున్నాయి.

LPG Cylinder : కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు

గతంలో 19కేజీల సిలిండర్ రూ.2012.50 ఉండేది. తాజాగా తగ్గిన ధరతో రూ.1976.50కి అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో, గతంలో కోల్‌కతాలో రూ. 2132.00కి అందుబాటులో ఉండగా, ఆగస్టు 1 నుంచి రూ. 2095.50కి అందుబాటులోకి వస్తోంది. వాణిజ్య సిలిండర్ ధర నేటి నుంచి ముంబైలో రూ.1936.50కి, చెన్నైలో రూ.2141కి తగ్గింది. నిన్నటివరకు వాణిజ్య సిలీండర్ ధరలు భారీగా ఉండటంతో హోటల్స్, టీ దుకాణాల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తాజాగా సిలీండర్ పై రూ. 36 తగ్గుదలతో వారికి కొంత ఉపశమనం లభించినట్లయింది. మరోవైపు గృహ వినియోగదారులు వినియోగించే 14.2 కేజీల సిలీండర్ ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు.

ట్రెండింగ్ వార్తలు