Refrigerator Is On Sale : ఫ్రిజ్ అమ్మకానికి కలదు..కానీ ఎక్కడుందో చెప్పగలరా ?

ఇలాంటి ఫొటోనే చక్కర్లు కొడుతోంది. అందులో ఫ్రిజ్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ పోస్టు చేశారు. ఫొటోను చూసి...తలలు పట్టుకున్నారు. అసలు ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నలు సంధించారు.

Refri

Refrigerator Is On Sale : సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. పోస్టు చేసిన ఫొటోలో ఫలానా జంతవు, ఫలానా వస్తువు ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ కొంతమంది పోస్టులు చేస్తుంటారు. ఇవి నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. వారు చెప్పినవి కనుక్కోలేక తల గీక్కుంటారు. తాజాగా..ఇలాంటి ఫొటోనే చక్కర్లు కొడుతోంది. అందులో ఫ్రిజ్ ఎక్కడుందో కనిపెట్టగలరా ? అంటూ పోస్టు చేశారు.

 

Read More : Gold Price: స్వల్పంగా తగ్గిన బంగారం ధర

ఫొటోను చూసి…తలలు పట్టుకున్నారు. అసలు ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నలు సంధించారు. నెటిజన్లను మరలా మరలా చూసేలా చేసింది. కానీ..అందులో ఫ్రిజ్ కనిపించలేదు. అందులో ఓ చెక్క తలుపు, అలమారాలు, మైక్రోవేవ్ ఓవెన్, ఇతర వంట గది వస్తువులు మాత్రమే కనిపిస్తున్నాయి. మరి ఫ్రిజ్ ఎక్కడుంది ? అంటూ ప్రశ్నించారు.

Read More : Sore Throat: గొంతు నొప్పి బాధిస్తుందా.. ఇంటి చిట్కాతో సొల్యూషన్

ఫ్రిజ్ ఫర్ సేల్ అనే క్యాప్షన్ తో ఫొటోను ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో ఇది 7 వేల సార్లు లైక్ చేయబడమే కాకుండా..2 వేల 300 మందికి పైగా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. నాకు ఒక క్షణం పట్టిందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా…ఫ్రిజ్ ను కనుక్కోవడానికి దాదాపు 20 సెకన్ల సమయం పట్టిందని మరొకరు తెలిపారు. అయితే..వాస్తవానికి అలమారాలు, మైక్రోవేవ్ ఓపెన్, వంటగదిలో ఉన్న సామాగ్రీ అసలు ఫొటోలు లేవు. వాస్తవానికి ఫ్రిజ్ తలుపు మీద అవి కనిపిస్తున్నాయి.