West Bengal’s Tableau : రిపబ్లిక్ డే.. బెంగాల్ శకటం తిరస్కరణపై మమత మండిపాటు

కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలియచేస్తుందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఇలాగే చేశారని...

West Bengal’s Tableau : రిపబ్లిక్ డే.. బెంగాల్ శకటం తిరస్కరణపై మమత మండిపాటు

Modi And Mamata

Updated On : January 16, 2022 / 6:02 PM IST

West Bengal’s Tableau  : దేశ రాజధాని న్యూఢిల్లీలో జరగబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర శకటం తిరస్కరణపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీరియస్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో బెంగాల్ సీఎం..కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న ఘర్షణ వాతావరణం మరోసారి తెరపైకి వచ్చింది. సుభాష్ చంద్రబోస్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న శకటాన్ని తిరస్కరించిన నేపథ్యంలో జోక్యం చేసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి సీఎం మమత లేఖ రాశారు. శకటం తిరస్కరణపై తాను దిగ్ర్భాంతికి గురైనట్లు, ఈ విషయం తనను బాధించిందన్నారు.

Read More : MLA Anna Venkata Rambabu : వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి కరోనా పాజిటివ్

ఎలాంటి కారణాలు తెలపకుండా తిరస్కరించడం విస్మయానికి కలిగిస్తోందని, 125వ జయంతి సంవత్సరంలో ఆయన సేవలను స్మరించుకుంటూ…ఇతరుల చిత్రాలను కూడా శకటంలో ఉంచడం జరిగిందన్నారు. ఈ దేశానికి చెందిన ప్రముఖుల కుమార్తెలు, కుమార్తెలను అందులో ఉంచామన్నారు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద, దేశబంధు చిత్తరంజన్ దాస్, శ్రీ అరబిందో, మాతంగిని హజ్రా, నజ్రుల్..ఎందరో దేశభక్తులు ఉన్నారని లేఖలో వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం వైఖరితో పశ్చిమ బెంగాల్ ప్రజలు తీవ్ర ఆవేదనకు, బాధకు గురవుతున్నారని..భారత స్వాతంత్ర్య పోరాటంలో బెంగాల్ అగ్రగ్రామిగా ఉందనే విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.

Read More : MLA Anna Venkata Rambabu : వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి కరోనా పాజిటివ్

75వ సంవత్సరంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా…స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకొనే విధంగా ఉండకపోవడం దిగ్ర్భాంతికరమన్నారు. కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పార్టీ నిరసన తెలియచేస్తుందని తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ వెల్లడించారు. గత సంవత్సరం కూడా ఇలాగే చేశారని, ఇప్పుడు కూడా తిరస్కరణ అంటూ చెబుతూ..ఎలాంటి కారణం వెల్లడించలేదన్నారు.