MLA Anna Venkata Rambabu : వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి కరోనా పాజిటివ్

సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ నాయకులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు కోవిడ్ బారిన పడ్డారు.

MLA Anna Venkata Rambabu : వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకి కరోనా పాజిటివ్

Mla Anna Venkata Rambabu

MLA Anna Venkata Rambabu : ఆంధ్రప్రదేశ్‌లో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం అలజడి రేపుతోంది. సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు అందరూ కోవిడ్ బారిన పడుతున్నారు. రాజకీయ నాయకులను కరోనా భయపెడుతోంది. ఇప్పటికే పలువురు పార్టీ నేతలు కోవిడ్ బారిన పడ్డారు.

తాజాగా ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకట రాంబాబుకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఎమ్మెల్యే ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఎమ్మెల్యే రాంబాబు కోరారు.

Eating Egg : రోజూ కోడి గుడ్డు తింటే మధుమేహం ముప్పు

కాగా.. ఫస్ట్ వేవ్, సెకెండ్ వేవ్‌లో కరోనా బారిన పడ్డవారు కూడా మరోసారి మహమ్మారి బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అధికార పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు మళ్లీ కరోనా బారినపడ్డారు. తాజాగా నిర్వహించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆయన తెలిపారు. ఆయనకు కరోనా సోకడం ఇది మూడోసారి. ప్రస్తుతం స్వల్ప లక్షణాలు ఉన్నాయని, ఇంట్లో క్వారంటైన్ లో ఉన్నానని, తనను కలిసేందుకు ఎవరూ రావొద్దని రాంబాబు సూచించారు. అంబటి రాంబాబుకు మొదట 2020 జూలైలో కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత డిసెంబర్ లో రెండోసారి.. తాజాగా మూడోసారి కూడా కరోనా సోకింది.

Block Unknown Numbers : ఈ ఆండ్రాయిడ్‌ ఫోన్లలో గుర్తుతెలియని నెంబర్లను ఇలా బ్లాక్ చేయండి..!

భోగి సందర్భంగా అంబటి రాంబాబు ప్రజలతో కలిసి ఆడిపాడారు. ఆ తర్వాత కరోనా స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

రాష్ట్రంలో క‌రోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 30,022 కరోనా నిర్థార‌ణ పరీక్షలు నిర్వహించగా.. 4,570 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,06,280 కి పెరిగింది. వైరస్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,510 కి పెరిగింది.