ATMలో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఈ ఆఫర్ వారికి మాత్రమే!

  • Published By: veegamteam ,Published On : March 30, 2020 / 11:36 AM IST
ATMలో కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు.. ఈ ఆఫర్ వారికి మాత్రమే!

Updated On : March 30, 2020 / 11:36 AM IST

భారతదేశంలోని రిలయన్స్ జియో వినియోగదారులు తమ మొబైల్ నెంబర్ను దగ్గరలోని ఏటీఎం నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ ఫీచర్ను భారతదేశంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI,  స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ తో సహా వివిధ బ్యాంకుల నుంచి పొందవచ్చని ట్విట్టర్ ద్వారా తెలిపారు.

 ATMలో రీఛార్జ్ చేయడానికి జియో యూజర్లు కార్డుని మెషిన్ లో పెట్టి.. రీఛార్జ్ ఆప్షన్ను క్లిక్ చేయాలి. మీరు ఎంత అయితే రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నారో  దాన్ని ఎంటర్ చేయాలి. అంతే మీ అకౌంట్ నుంచి డబ్బులు కట్ అయిపోయి రీఛార్జ్ అయిపోతుంది.

 అనంతరం మీకు రీఛార్జ్ అయినట్టు మెసేజ్ కూడా వస్తుంది. అంతేకాదు జియో వినియోగదారుల కోసం వర్క్ ఫ్రొం హోమ్ ప్రీపెయిడ్ ప్లాన్ను కూడా వెల్లడించారు. ఈ ప్లాన్ రోజుకు 2GB డేటాను అందిస్తుంది. 51 రోజులపాటు చెల్లుబాటవుతుంది. ఈ ప్యాక్ కాస్ట్ రూ.251 అని తెలిపారు.

Also Read | కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీలో తగ్గిన కాలుష్యం..స్వచ్చమైన గాలి