ఆర్జీ కర్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ల మూకమ్మడి రాజీనామాలు.. ఎందుకో తెలుసా..

యావత్ దేశం ఉలిక్కిపడే సంఘటన చోటు చేసుకుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన ట్రైనీ డాక్టర్..

ఆర్జీ కర్ ఆసుపత్రి సీనియర్ డాక్టర్ల మూకమ్మడి రాజీనామాలు.. ఎందుకో తెలుసా..

RG Kar Medical College (Photo Credit : Google)

Updated On : October 9, 2024 / 7:53 PM IST

RG Kar Medical College : ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన 50 మంది సీనియర్ డాక్టర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారంతా రాజీనామాలు చేశారు. డిమాండ్ల సాధన కోసం నిరాహార దీక్ష చేస్తున్న వైద్యులకు మద్దతుగా వారు ఈ డెసిషన్ తీసుకున్నారు. ఆందోళనలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. వారి డిమాండ్లు ఏంటంటే.. అన్ని ఆసుపత్రుల్లో భద్రత పెంచాలి. డాక్టర్లకు రక్షణతో పాటు భద్రత కల్పించాలి.

మెరుగైన పని వాతావరణం కల్పించాలి. అన్ని హాస్పిటల్స్ లో మౌలిక సదుపాయాలను మెరుగు పరచాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యవస్థాగత సంస్కరణలు చేయాలి. దాంతో పాటు వైద్య ఆరోగ్య శాఖలోని పలువురు కీలక ఉన్నతాధికారులను బదిలీ చేయాలి. ట్రైనీ డాక్టర్ హత్యచార కేసు, అనంతరం జరిగిన చర్చల్లో తమ డిమాండ్లు నెరవేర్చడంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందంటూ జూనియర్ డాక్టర్లు నిరహార దీక్షకు దిగారు.

Also Read : హర్యానాలో కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టిన ఆప్‌.. క‌లిసి పోటీచేస్తే ఫ‌లితాలు మ‌రోలా ఉండేవా..

రాష్ట్ర ప్రభుత్వంపై పెరిగిన ఒత్తిడి..
ఇక సీనియర్ డాక్టర్లకు మద్దతుగా కొందరు డిపార్ట్‌మెంట్ హెడ్‌లు కూడా నిలిచారు. రాబోయే ఆరోగ్య విపత్తును పరిష్కరించడంలో, డాక్టర్లకు భద్రత కల్పించే విషయంలో అధికార యంత్రాంగం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో తామీ నిర్ణయం తీసుకున్నట్లు వారు వివరించారు. SSKM, NRS వంటి ఇతర ప్రముఖ వైద్య సంస్థల డాక్టర్లు సైతం తమను అనుసరించవచ్చని పేర్కొన్నారు. సీనియర్ డాక్టర్ల రాజీనామా వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడిని పెంచినట్లైంది.

తమ ఉద్యమంలో సీనియర్లు కూడా వచ్చి చేరడంతో జూనియర్ డాక్టర్ల నిరసన కార్యక్రమం మరింత ఊపందుకుంది. అయితే, ఈ నిరసనలు రాష్ట్రంలోని వైద్య సేవలపై తీవ్రమైన ప్రభావం చూపాయి. సీనియర్ డాక్టర్ల మూకుమ్మడి రాజీనామాలు, నిరాహార దీక్షలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతుండడంతో రాష్ట్రంలో ఆరోగ్య సేవలను ప్రమాదకర స్థితిలోకి నెట్టాయి.

కాగా, నవంబర్ మొదటి వారంలోగా తగిన భద్రతా చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే, అది అమలయ్యే వరకు తమ నిరసనలు కొనసాగుతాయని వైద్యులు తేల్చి చెప్పారు.

RG Kar Medical College And Hospital Junior Doctors Protest (Photo Credit : Google)

దారుణ హత్యాచారానికి గురైన తమ సహోద్యోగికి న్యాయం చేయాలనే డిమాండ్ తో జూనియర్ డాక్టర్లు దుర్గా పూజలు జరుగుతున్న మండపాల దగ్గర కరపత్రాలు పంపిణీ చేశారు. అలాగే రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. నిరాహార దీక్ష చేస్తున్న తమ కొలీగ్స్ కు మద్దతుగా.. జూనియర్, సీనియర్ వైద్యులు ర్యాలీ నిర్వహించారు.

యావత్ దేశం ఉలిక్కిపడే దారుణం..
ఆగస్టు 9న దారుణం జరిగింది. యావత్ దేశం ఉలిక్కిపడే సంఘటన చోటు చేసుకుంది. ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చెందిన ట్రైనీ డాక్టర్ హత్యాచారానికి గురైంది. ఈ దారుణం యావత్ దేశాన్ని కుదిపేసింది. ఆమెకు న్యాయం జరగాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్ డాక్టర్లు పోరుబాట పట్టారు. విధులను బహిష్కరించి నిరవధిక ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో సీఎం మమతా దిగి వచ్చారు. వారితో చర్చలు జరిపారు. జూనియర్ డాకర్లు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచగా.. అందులో కొన్నింటిని నెరవేర్చేందుకు సీఎం మమతా అంగీకరించారు. అయితే, అవేవీ అమల్లోకి రాకపోవడంతో డాక్టర్లు ఆందోళనను ఉధృతం చేశారు.

Also Read : జిలేబీ కావాలా నాయనా..! రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తున్న బీజేపీ.. అసలేంటీ జిలేబీ గోల..