జిలేబీ కావాలా నాయనా..! రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తున్న బీజేపీ.. అసలేంటీ జిలేబీ గోల..

జిలేబీ కావాలా నాయనా..! రాహుల్ గాంధీని ట్రోల్ చేస్తున్న బీజేపీ.. అసలేంటీ జిలేబీ గోల..

Rahul Gandhi Jalebi (Photo Credit : Google)

Updated On : October 9, 2024 / 6:22 PM IST

Rahul Gandhi Jalebi : హరియాణా ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అక్కడ మరోసారి కమలం వికసించింది. ఏకంగా హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది బీజేపీ. వరుసగా మూడోసారి అధికారం దక్కించుకుంది. హరియాణాలో కాంగ్రెస్ ఓటమిపాలవడంతో నెట్టింట్లో జిలేబీ ట్రెండ్ అవుతోంది. జిలేబీకి, కాంగ్రెస్ ఓటమికి, రాహుల్ గాంధీకి అసలు సంబంధం ఏంటి..

హరియాణాలో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ముమ్మరంగా ఆయన క్యాంపెయిన్ చేశారు. కాంగ్రెస్ ను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. గొహనాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్ గాంధీ.. స్థానికంగా ఫేమస్ అయిన స్వీట్ జిలేబీ గురించి ప్రస్తావించారు. జిలేబీని పెద్ద ఎత్తున ఎగుమతి చేసేలా పరిశ్రమలు రావాలని కామెంట్ చేశారు.

Also Read : జమ్మూకశ్మీర్ లో ఫలితాలు వెలువడిన మరుసటిరోజే ఉగ్రవాదుల బరితెగింపు..

”ఈ లోకల్ రుచికరమైన జిలేబీ దేశం మొత్తం చేరాలి. ఫ్యాక్టరీలలో పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేస్తే దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి కూడా చేయొచ్చు. అమెరికా, జపాన్ లాంటి దేశాలకు పంపాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో వేరే దేశాలకు పంపడం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది” అని రాహుల్ అన్నారు.

Rahul Gandhi Troll (Photo Credit : Google)

రాహుల్ నివాసానికి జిలేబీ పంపిన బీజేపీ..
నాడు ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ అన్న వ్యాఖ్యలను ఇప్పుడు బీజేపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నాయి. రాహుల్ గాంధీని పప్పు అనేది అందుకే అని ఓ ఆటాడుకున్నాయి. అంతేకాదు రాహుల్ గాంధీ ఇంటికి జిలేబీ డబ్బాను పార్సిల్ కూడా పంపించాయి. ఢిల్లీలోని ప్రముఖ స్వీట్ షాపులో కేజీ జిలేబీ కొనుగోలు చేసిన బీజేపీ కార్యకర్తలు.. దాన్ని పార్సిల్ చేసి 24 అక్బర్ రోడ్ లోని రాహుల్ గాంధీ నివాసానికి డెలివరీ చేశారు. దీనికి సంబంధించిన ఆర్డర్ ను హరియాణా బీజేపీ తమ సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది.

Also Read : హర్యానాలో కాంగ్రెస్‌ను దెబ్బ‌కొట్టిన ఆప్‌.. క‌లిసి పోటీచేస్తే ఫ‌లితాలు మ‌రోలా ఉండేవా..

అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేసిన బీజేపీ…
హరియాణా ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సత్తా చాటింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 48 సీట్లు కైవసం చేసుకుంది.