ఓటుకి నోటు : ఒక్కొక్కరికీ రూ.300.. కోటిన్నర పట్టివేత
సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి.
చెన్నై: సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోడానికి అధికారులు చేస్తున్న దాడులు తమిళనాడు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం అవుతుందనగా.. మంగళవారం రాత్రి ఆదాయపు పన్నుశాఖ అధికారులు తేనీ జిల్లాలోని ఆండిపట్టి నియోజక వర్గం పరిధిలోని టీటీవీ దినకరన్ పార్టీకి చెందిన ఓ కార్యకర్త షాపులో సోదాలు చేశారు. ఈదాడుల్లో కోటి 48 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదు ఓటర్లకు పంచటానికి సిధ్దం చేసినట్లు అక్కడ ఆధారాలు లభ్యం అయ్యాయి.
Read Also : వినూత్న వివాహం : పెళ్లంతా 100 శాతం ఓటింగ్ నినాదమే
ఐటీ అధికారులు అక్కడకు చేరుకోగానే టీటీవీ దినకరన్ కు చెందిన ఏఎమ్ఎమ్ కే పార్టీ కార్యకర్తలు అధికారులతో వాగ్వావాదానికి దిగారు. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కార్యకర్తలను చెదరగొట్టటానికి పోలీసులు నాలుగు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరపారు. కొంత మంది కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఓ దుకాణంలో సోదాలు జరపగా 94 ప్యాకెట్లలో ప్యాక్ చేసిన కోటి 48 లక్షల రూపాయల నగదు దొరికింది. ఆ ప్యాకెట్ల మీద డబ్బును ఎక్కడెక్కడకు పంపాలి.. ఎవరెవరికి ఇవ్వాలి, ఎంతెంత ఇవ్వాలి.. ఎంతమంది ఓటర్లకు ఇవ్వాలి అనే వివరాలు మొత్తం రాసి ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఒక్కొక్కరికీ 300 రూపాయల లెక్కన ఇవ్వాలని కూడా కొన్ని చీటీలపై రాసి ఉంది.
Read Also : సంచలనం : టిక్ టాక్ యాప్ బ్లాక్ చేసిన గూగుల్