Jharkhand : భార్య చివరి కోరిక..రూ. 17 లక్షల బంగారం విరాళం ఇచ్చిన భర్త
12 జ్యోతిర్లింగాల్లో మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వెళ్లి...అమ్మవారిని దర్శించుకోవడం రష్మీ ప్రభకు ఎంతగానో ఇష్టం ఉండేది.

Jarkhand
Ujjain temple : బంగారం లాంటి భర్త దొరకాలని ప్రతి యువతి అనుకుంటుంటుంది. అయితే…వధువుకు భారీ బంగారం కానుకలు ఇస్తూ…భర్తలు సర్ ఫ్రైజ్ ఇస్తుంటారు. ఇటీవలే..ఓ వధువుకు 60 కిలోల బంగారం ఆభరణాలు ఇచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. సరిగ్గా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. భార్య కోరిక తీర్చడానికి ఏకంగా ఒకటి కాదు..రెండు కాదు…ఏకంగా 17 కేజీల బంగారం ఇచ్చాడు. కానీ..ఇందులో విషాదం దాగి ఉంది. భార్య చివరి కోరిక తీర్చడానికి ఈ బంగారాన్ని అమ్మవారికి విరాళం ఇచ్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
Read More : Notices to Rahul : రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు సమన్లు జారీ
జార్ఖండ్ లోని బొకారోలో సంజీవ్ కుమార్…రష్మీ ప్రభలు దంపతులు నివాసం ఉంటున్నారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మధ్యప్రదేశ్ ఉజ్జయిని జిల్లాలోని మహాకాళేశ్వర్ దేవాలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వెళ్లి…అమ్మవారిని దర్శించుకోవడం రష్మీ ప్రభకు ఎంతగానో ఇష్టం ఉండేది. అమ్మవారిని భక్తితో కొలిచేవారు. అయితే..గత కొంతకాలంగా…అనారోగ్యంతో బాధ పడుతున్న రష్మీ…ఇటీవలే కన్నుమూసింది. చనిపోయే ముందు…ఆమె అమ్మవారికి తన నగలను సమర్పించాలని..ఇదే తన చివరి కోరిక అంటూ…భర్తకు చెప్పింది.
Read More : Hyderabad : 16 ఏళ్లకే ప్రేమలో పడ్డ అబ్బాయి..వద్దు అన్నందుకు ఆత్మహత్య..
దీంతో భార్య అంత్యక్రియలు..ఇతర కార్యక్రమాలు పూర్తయిన అనంతరం…మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్లి…భార్య ఆభరణాలు, 310 గ్రాముల బరువున్న నెక్లెస్ లు, గాజులు, చెవిపోగులతో సహా…మొత్తం రూ. 17 లక్షల విలువైన ఆభరణాలను అమ్మవారికి విరాళంగా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆలయ అడ్మినిస్ట్రేటర్ గణేష్ కుమార్ వెల్లడించారు.