చెత్త ఏరుకుని బతికే మహిళ ఇంట్లో భారీగా డబ్బు..బంగారం

  • Published By: nagamani ,Published On : August 17, 2020 / 11:26 AM IST
చెత్త ఏరుకుని బతికే మహిళ ఇంట్లో భారీగా డబ్బు..బంగారం

Updated On : August 17, 2020 / 12:09 PM IST

చెత్త ఏరుకునే ఓ మహిళ ఫుట్ పాత్ పై మరణించింది. ఆమె నివసించే గుడిసెలో రూ.2లక్షల నగదు, భారీగా బంగారం బయటపడింది. చెత్త ఏరుకునే 57 ఏళ్ల ప్రభావతి అనే మహిళ చెన్నై నగరంలోని సెక్రటేరియెట్ కాలనీలో ఫుట్ పాత్ పై మరణించింది. ప్రభావతికి రాజేశ్వరి, విజయలక్ష్మీలనే ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు.



వారిద్దరూ ఒట్టేరిలోని స్లమ్ క్లియరెన్స్ బోర్డులో ఓ గుడిసెలో (టార్పాలిన్ షీట్లతో పైకప్పుతో) ఉంటున్నారు. ఈ క్రమంలో జూన్ 25న ప్రభావతి చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆమెకు సంబంధించినవారు ఎవరన్నా ఉన్నారా? అని ఎంక్వయరీ చేయగా రాజేశ్వరి, విజయలక్ష్మీ అనే ఇద్దరు అక్కలు ఉన్నారని తెలిసింది.



దీంతో వారిని సంప్రదించారు. మీ చెల్లెలు చనిపోయింది..కర్మకాండలు చేస్తారా? అని అడగగా..మాకు అంత స్తోమత లేదని తెలిపారు. దీంతో పోలీసులే ప్రభావతి కర్మకాండలు జరిపించారు. అనంతరం ప్రభావతి నివసించిన గుడెసెను పరిశీలించగా..రూ.2 లక్షల డబ్బు, ఓ కుండ నిండా రెండు..ఐదు..రూపాయిల నాణాలు..బంగారు ఆభరణాలు కనిపించాయి.



కరెన్సీ నోట్లలో రూ.2లక్షల కొత్త కరెన్సీ నోట్లతో పాటు రద్దు అయిన పాత 500,1000 రూపాయల నోట్లు లభించాయి. వీటిని చూసిన పోలీసులు ఆశ్చర్యపోయారు. ఏడు సవరల బంగారం ఉందని పోలీసులు తెలిపారు. ఆ డబ్బును..బంగారు ఆభరణాలకు ప్రభావతి అక్కలకు అందజేస్తామని తెలిపారు.