రైతుకు రూ.3లక్షల పంట రుణం

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

  • Published By: veegamteam ,Published On : February 16, 2020 / 02:17 AM IST
రైతుకు రూ.3లక్షల పంట రుణం

Updated On : February 16, 2020 / 2:17 AM IST

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా రైతులకు అందించే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ తెలిపారు. రైతులు సంవత్సరానికి 7 శాతం వడ్డీ చొప్పున గరిష్ఠంగా రూ.3 లక్షల వరకు స్వల్పకాలిక రుణాలను పొందే అవకాశం ఉంటుందన్నారు. శనివారం (ఫిబ్రవరి 15, 2020) ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కీలక చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు.

ఇందులో భాగంగా పలు పథకాల అమలుకు బడ్జెట్‌లో రూ.1.6 లక్షల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. పీఎం కిసాన్‌ పథకానికి రూ.75వేల కోట్లు కేటాయించామన్నారు. బ్యాంకులు రైతులకు అందిస్తున్న రుణాలకు కేంద్రం పర్యవేక్షిస్తున్నదని చెప్పారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు రైతులకు అందించే రుణ పరిమితిని పెంచినట్లు తెలిపారు. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణాల లక్ష్యం రూ.13.5 లక్షల కోట్లుగా ఉందన్నారు. 2020-21లో రూ.15 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించామని వెల్లడించారు. సాధారణంగా ఏటా రుణ లక్ష్యాన్ని 9 శాతం పెంచుతారని, తాము 11 శాతం పెంచామని పేర్కొన్నారు.

Read More>>సండే..తెలంగాణ కేబినెట్ భేటీ : తీపి కబుర్లు ఉంటాయా,కోవిడ్ – 19 (కరోనా) వైరస్ 4 లక్షల మందిని చంపేస్తుంది