Parliment
Parliament: జూలై 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు వరుస ఉత్తర్వులు జారీ అయ్యాయి. వాటిల్లో ఒకటి ‘అన్ పార్లమెంటరీ’ పదాలను నిషేధించడం, తాజాగా పార్లమెంటు ఆవరణలో ‘ధర్నాలు, ఆందోళనలు, నిరసనలు నిషేధం. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో ధర్నాపై నిషేధం విధిస్తూ రాజ్యసభ కొత్త సర్క్యులర్‌ను విడుదల చేసిన తర్వాత, పార్లమెంటు సభ్యులు ఎటువంటి ప్రదర్శన, ధర్నా కోసం పార్లమెంట్ ఆవరణాన్ని ఉపయోగించొద్దంటూ శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వులను రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ ఓ బులెటిన్ లో తెలిపారు. సభ్యులందరూ సహకరించాలని ఆయన కోరారు.
అయితే రాజ్యసభ కార్యదర్శి తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ తప్పుబట్టారు. విశ్వగురు కొత్త నాటకమని, ధర్నా మనా హై అంటూ జైరాం తన ట్విట్టర్‌లో ఆరోపించారు. అలాంటి ఆంక్షలేమీ లేవని పార్లమెంట్ స్పీకర్ నుంచి తనకు ప్రకటన అందిందని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తెలిపారు. పార్లమెంట్ స్పీకర్ నుండి మాకు అలాంటి పరిమితి లేదని (పార్లమెంట్ ఆవరణలో నిరసనలకు అనుమతి లేదు) ఒక ప్రకటన వచ్చిందని, రాజకీయ పార్టీల నాయకులు రేపు ఢిల్లీలో కలిసి కూర్చుని ఈ అంశంపై చర్చిస్తారని పవార్ ఓ జాతీయ ఛానెల్ తో తెలిపారు.
CM KCR: కేంద్ర సర్కారుపై కేసీఆర్ మరోసారి పోరాటం.. విపక్ష నేతలు, సీఎంలకు ఫోన్లు
మరోవైపు పార్లమెంటు ఉభయ సభల్లో ‘అన్‌పార్లమెంటరీ’ పదాలను నిషేధిస్తూ గురువారం ప్రకటన వెలువడిన విషయం విధితమే. ఆ ప్రకటనలపై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే.. పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, ఆందోళనలపై ప్రకటన రావటం గమనార్హం. గతంలో విపక్షాలు పార్లమెంట్ కాంప్లెక్స్ లోపల, గాంధీ విగ్రహం ముందు నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే కొన్ని పదాలను పార్లమెంట్‌లో వాడరాదని వచ్చిన వార్తలను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కొట్టిపారేసిన విషయం తెలిసిందే. కానీ ఆయా పదాలను అవసరాన్ని బట్టి రికార్డుల నుంచి తొలగిస్తామన్నారు.
https://twitter.com/Jairam_Ramesh/status/1547802825085702144?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1547802825085702144%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.indiatoday.in%2Findia%2Fstory%2Fparliament-monsoon-session-controversy-no-dharna-words-1975908-2022-07-15