CM KCR: కేంద్ర స‌ర్కారుపై కేసీఆర్ మ‌రోసారి పోరాటం.. విప‌క్ష నేత‌లు, సీఎంల‌కు ఫోన్లు

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బిహార్‌లోని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్‌, ఎన్సీపీ అధినేత‌ శరద్ పవార్ సహా ఇతర విపక్ష నేతలతో స్వయంగా ఫోనులో మాట్లాడారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్ర‌తిపాదనలకు విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు.

CM KCR: కేంద్ర స‌ర్కారుపై కేసీఆర్ మ‌రోసారి పోరాటం.. విప‌క్ష నేత‌లు, సీఎంల‌కు ఫోన్లు

Kcr

CM KCR: కేంద్ర స‌ర్కారుపై పోరాటానికి తెలంగాణ‌ సీఎం కేసీఆర్ మ‌రోసారి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నారు. కేంద్రం అనుసరిస్తున్న అసంబద్ధ వైఖరిపై పోరాడాల‌ని నిర్ణ‌యించారు. కేంద్ర ప్ర‌భుత్వంతో పోరాటానికి కలిసివచ్చే అన్ని విపక్ష పార్టీలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాల‌ని ప్ర‌ణాళిక‌లు వేసుకున్నారు. దేశంలో ప్రమాదంలో పడుతున్న స‌మాఖ్య‌, లౌకిక, ప్రజాస్వామిక విలువలను కాపాడాలనే ల‌క్ష్యంతో పోరాడాల‌ని నిర్ణ‌యించారు.

IIT Madras: దేశంలో ఉత్త‌మ విద్యా సంస్థ‌గా ఐఐటీ-మ‌ద్రాస్.. ర్యాంకులు వెల్ల‌డి

ఆర్థిక సంక్షోభంలోకి దేశాన్ని నెట్టివేస్తున్న కేంద్ర వైఖరిని తేటతెల్లం చేయాలంటూ ఇందుకు త‌గ్గ‌ కసరత్తు ప్రారంభించారు. పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకుని బీజేపీ, కేంద్ర ప్రభుత్వ తీరుపై పోరాడాల‌ని నిర్ణ‌యించారు. దేశవ్యాప్తంగా నిరసనలతో కేంద్రం అసలు స్వరూపాన్ని బ‌య‌ట‌పెట్టాల‌ని భావిస్తున్నారు. ఈ మేర‌కు దేశంలోని పలు రాష్ట్రాల విపక్ష నేతలతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇవాళ‌ పలు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులతో మాట్లాడారు.

srilanka crisis : శ్రీలంకలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆ ‘ఆరుగురు’ యువకులు..!

ఇప్పటికే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌, తమిళనాడు సీఎం స్టాలిన్ సన్నిహితులతో, బిహార్‌లోని ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్‌, యూపీ ప్రతిపక్షనేత అఖిలేశ్ యాదవ్‌, ఎన్సీపీ అధినేత‌ శరద్ పవార్ సహా ఇతర విపక్ష నేతలతో స్వయంగా ఫోనులో మాట్లాడారు. కేంద్రంపై ప్రజాస్వామిక పోరాటంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్ర‌తిపాదనలకు విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, ప్రధాన ప్రతిపక్ష నేతలు సానుకూలంగా స్పందిస్తున్నారు.