IIT Madras: దేశంలో ఉత్త‌మ విద్యా సంస్థ‌గా ఐఐటీ-మ‌ద్రాస్.. ర్యాంకులు వెల్ల‌డి

కేంద్ర విద్యాశాఖ ఇవాళ ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌ ర్యాంకులు ప్ర‌క‌టించింది. ఉత్త‌మ విద్యా సంస్థ‌లు, విశ్వవిద్యాలయాల పేర్ల‌ను విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. ఇందులో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)-మ‌ద్రాస్ ఉత్త‌మ విద్యా సంస్థ‌గా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఉత్తమ విశ్వ‌విద్యాల‌యంగా ఐఐఎస్‌సీ-బెంగ‌ళూరు పేరును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.

IIT Madras: దేశంలో ఉత్త‌మ విద్యా సంస్థ‌గా ఐఐటీ-మ‌ద్రాస్.. ర్యాంకులు వెల్ల‌డి

Iit Madras

IIT Madras: కేంద్ర విద్యాశాఖ ఇవాళ ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌ ర్యాంకులు ప్ర‌క‌టించింది. ఉత్త‌మ విద్యా సంస్థ‌లు, విశ్వవిద్యాలయాల పేర్ల‌ను విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వెల్ల‌డించారు. ఇందులో ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ)-మ‌ద్రాస్ ఉత్త‌మ విద్యా సంస్థ‌గా అగ్రస్థానంలో నిలిచింది. అలాగే, ఉత్తమ విశ్వ‌విద్యాల‌యంగా ఐఐఎస్‌సీ-బెంగ‌ళూరు పేరును కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. రెండో ఉత్త‌మ విశ్వ‌విద్యాల‌యంగా ఢిల్లీలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ వ‌ర్సిటీ, మూడో ఉత్త‌మ వర్సిటీగా జామియా మిలియా ఇస్లామియా నిలిచాయి.

srilanka crisis : శ్రీలంకలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆ ‘ఆరుగురు’ యువకులు..!

ఉత్త‌మ బిజినెస్ స్కూళ్ళ జాబితాలో ఐఐఎం-అహ్మ‌దాబాద్‌, ఐఐఎం బెంగ‌ళూరు, ఐఐఎం-క‌ల‌క‌త్తా తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఉత్త‌మ క‌ళాశాల‌ల విభాగంలో తొలి మూడు స్థానాల్లో వ‌రుస‌గా మిరాంద హౌస్, హిందూ కాలేజ్, ప్రెసిడెన్సీ కాలేజీలు ఉన్నాయి. ఉత్త‌మ వైద్య కాలేజీగా ఢిల్లీలోని ఎయిమ్స్, ఉత్త‌మ దంత వైద్య క‌ళాశాల‌గా స‌వితా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్‌, టెక్నిక‌ల్ సైన్సెస్ నిలిచాయి.