srilanka crisis : శ్రీలంకలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆ ‘ఆరుగురు’ యువకులు..!

మార్చి 1న మొదలైన ఉద్యమం ఉధృతమైంది. ఆ ‘ ఆరుగురితో ప్రారంభమైన ఆందోళన’ తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే... ఏకంగా అధ్యక్షుడే దేశం విడిచి వెళ్లేంతగా. అవును శ్రీలంకలో ఉద్యమాలకు ఆరుగురు యువకులే కారణం. లంక విప్లవానికి ఊపిరిలందడానికి.. జనం ముందడుగు వేసి.. ప్రభుత్వాన్నే కూలదోయడానికి కారణం.. వాళ్లు శ్రీకారం చుట్టిన చిన్న ఉద్యమమే.

srilanka crisis : శ్రీలంకలో ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన ఆ ‘ఆరుగురు’ యువకులు..!

Six Young Men Who Started Movements In Sri Lanka (2)

srilanka crisis..Six young mens : మార్చి 1న మొదలైన ఉద్యమం ఉధృతమైంది. ఆరుగురితో ప్రారంభమైన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. ఎంతలా అంటే… ఏకంగా అధ్యక్షుడే దేశం విడిచి వెళ్లేంతగా. అవును శ్రీలంకలో ఉద్యమాలకు ఆరుగురు యువకులే కారణం. లంక విప్లవానికి ఊపిరిలందడానికి.. జనం ముందడుగు వేసి.. ప్రభుత్వాన్నే కూలదోయడానికి కారణం.. వాళ్లు శ్రీకారం చుట్టిన చిన్న ఉద్యమమే. అద్భుతం జరుగుతున్నప్పుడు ఎవరూ గుర్తించరు.. అద్భుతం జరిగిన తర్వాత ఎవరూ గుర్తించాల్సిన అవసరం ఉండదు..

ఇప్పుడు శ్రీలంకలో జరుగుతున్నది ఇదే. ఓ వైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంటే.. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుంటే.. జనం పడుతున్న అవస్థలను చూడలేకపోయిన ఓ ఆరుగురు కుర్రాళ్లు.. మొదలుపెట్టిన ఉద్యమాన్ని మొదట్లో ఎవరూ గుర్తించలేదు. ఆ చిన్న ఉద్యమమే మహోద్యమమై.. మహాప్రభంజనమై.. జనవాహినిని అధ్యక్షుడి భవనానికి నడిపిస్తుందని ఆరోజు ఎవరూ ఊహించలేదు. మార్చి 1న కేవలం ఆరుగురితోనే శ్రీలంక విప్లవం బీజం పోసుకుంది… పోరాడితే పోయేదేం లేదు .. నిరంకుశ ప్రభుత్వాలు తప్ప.. అంటూ ఆ ఆరుగురు వేసిన తొలి అడుగు.. ఇప్పుడు ఏకంగా అధ్యక్షుడే దేశం వదిలి పారిపోయేలా చేసింది.

ఏదైనా ఉద్యమం చేపట్టాలంటే ఎవరో ఒకరు ముందుండాలి. పనిచేసే సంస్థలో గానీ, ప్రభుత్వం పనితీరుపై వ్యతిరేక గళం వినిపించాలనుకుంటే వారందరిని ఏకతాటిపై తీసుకెళ్లే లక్షణాలు కలిగి ఉండాలి. అందుకోసం చాలా కష్ట, నష్టాలను భరించాల్సి ఉంటుంది. చాలా మంది మనకెందుకు ఈ గోల అని అనుకుంటారు. కానీ శ్రీలంకలో మాత్రం తమ దేశ ఆర్థిక పరిస్థితి ఆరుగురు యువకులను ఆలోచనలో పడేసింది. రోజురోజుకు దివాలా తీస్తున్న తమ దేశంలో మార్పులు తీసుకురావాలని భావించారు. అనుకున్నదే తడవుగా మార్చి 1న ఉద్యమాన్ని ప్రారంభించారు. అలా శ్రీలంకలో మొదలైన ఉద్యమం.. కట్టలు తెంచుకుంటోంది. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలపడంతో మొదలైన విప్లవం.. ప్రెసిడెంట్‌, ప్రైమ్‌మినిస్టర్‌ ఇళ్ల గేట్లు పగలగొట్టే వరకూ వెళ్లింది.

మొదట విద్యుత్ కోతలు, ధరల పెరుగుదలపై ఆరుగురు యువకులు కొహువాలా స్టేషన్‌లో ఉద్యమాన్ని ప్రారంభించారు. రాజపక్స కుటుంబ పాలనకు వ్యతిరేకంగా నినాదాలు, క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. గ్యాస్, మందులు, ఆహార కొరతతో ఆ యువకుల్లో మరింత ఆగ్రహం పెరిగింది. గొటబాయ రాజపక్స వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మొదట ఆరుగురి యువకుల ఆందోళనలపై శ్రీలంకలో జోకులు పేలాయి. వారి ఇళ్లపక్కన ఉండేవాళ్లే వాళ్లను చూసి నవ్వుకున్నారు. ఫ్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపిన వారిని లంకేయులు జోకర్లుగా చూశారు. పైగా వాళ్లు పోరాడుతోంది అత్యంత క్రూరుడుగా.. ఎల్‌టీటీఈని తుదిముట్టించాడన్న పేరు దక్కించుకున్న ప్రెసిడెంట్ గొటబాయ రాజపక్సపైన. లంక రాజకీయాలను కంటి చూపుతో శాసిస్తున్న రాజపక్స కుటుంబం పైన. కానీ ఆ ఆరుగురు మాత్రం వెనక్కి తగ్గలేదు. తమ నిరసన ఆగలేదు. వారి ఉద్యమం సోషల్‌ మీడియాలో పాపులర్‌ కావడంతో రెండోరోజుకు మరో 50 మంది తోడయ్యారు. రోజులు గడుస్తున్న కొద్దీ వందలు, వేలకు చేరారు. శ్రీలంక చోటుచేసుకున్న తొలి రాజకీయేతర ఉద్యమం ఇది. ఇందులో రాజకీయ నేతలు లేరు.. సెలబ్రిటీలు లేరు.. అంతా జనమే.. ఎక్కువ మంది యువతరమే.. పాలించడం చేతగాని ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎగసిపడ్డ ఉద్యమ కెరటాలివి.వేల మంది శ్రీలంక వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. కోహువాలా స్టేషన్‌ వేదికగా ప్రారంభమైన పోరాటం… మిరిహానాకు చేరింది. ఆ తర్వాత కొలంబోను తాకాయి. వివిధ గ్రూపుల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. గొట గో గామా అన్న నినాదాలతో కొలంబో వీధులు మారుమోగాయి.

రోజురోజుకు శ్రీలంకలో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిపోయింది. సరైన పాలన లేక అస్తవ్యస్తంగా మారింది. పెరిగిపోయిన అప్పులు.. తరిగిపోయిన ఆదాయం… భవిష్యత్‌ అంతా శూన్యం. దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. దేశం దివాలా తీసేందుకు రాజపక్సే కారణమని లంకేయులు భగ్గుమన్నారు. మొదట ఉద్యమాన్ని ప్రారంభించిన విముక్తి దుశాంత, కరుణరత్నే తగ్గేది లేదంటూ మార్చి చివరిలో కొలొంబోని మహాదేవి పార్క్‌ వద్ద మౌనదీక్ష చేస్తామని ఫేస్‌బుక్‌లో ప్రకటించారు. అలా మార్చి 31న వందలాది నిరసనకారుల ఆధ్వర్యంలో కొలొంబో దద్దరిల్లిపోయింది. ఆ రోజు అక్కడ ఇచ్చిన స్పీచ్‌తో కరుణరత్నె కొత్త నాయకుడిగా అవతరించాడు. ఆయన స్పీచ్‌కు ఆశ్చర్యపోయిన మీడియా సైతం కరుణరత్నెను ఏ పార్టీకి చెందినవారని ప్రశ్నించింది. దీనికి తాను ఏ పార్టీకి చెందిన వాడినికాదని క్లారిటీ ఇచ్చారు. రాజపక్స రాజీనామా చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని చెప్పారు. ఉద్యమం ఉధృతమైన క్రమంలో ఆందోళనకారులపై పోలీసులు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ ఆందోళనల్లో అనేక మంది నిరసనకారులు గాయపడ్డ పడ్డారు. దలాది మందిపై కేసులు నమోదు చేశారు. ఇలా నెల రోజుల్లోనే పరిస్థితి ఉగ్రరూపం దాల్చింది.

ఏప్రిల్‌ 1న శ్రీలంకలో పరిస్థితి మొత్తం మారిపోయింది. వందలాది నిరసనకారులపై పోలీసులు కేసులు బనాయించడంతో ఆందోళనకారులకు మద్దతుగా వాదించడానికి లాయర్లు ముందుకొచ్చారు. ఆ రోజే శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు కౌంట్‌డౌన్‌ మొదలైంది. ఆ తర్వాత నిరసన కార్యక్రమాలకు మద్దతిచ్చి క్రిస్టియన్‌, బుద్దిస్ట్‌, ముస్లిం మత పెద్దలు స్వయంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఏప్రిల్‌ 1న క్యాథలిక్‌ బిషప్‌లు ప్రత్యేక సమావేశం నిర్వహించి… దేశాన్ని కాపాడేందుకు రాజకీయ పార్టీలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వారి పిలుపుతో కొలంబో, అనురాధపురలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు బుద్దిస్టులు. రాజకీయ నేతలను తమ ఆశ్రమాల్లోకి అనుమతించవద్దని బుద్దిస్టులు నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి లంక విప్లవం మరో మలుపు తిరిగింది.