Dattatreya Hosabale: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, పేదరికంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్
‘‘20 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందుకు మనం చింతించాలి. అలాగే 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉంది. పేదరికం మనకు దెయ్యంలాగ అవతరించింది. మనం ఆ దెయ్యాల్ని చంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో దత్తాత్రేయ పేర్కొన్నారు.

RSS expresses concern over rising income inequality
Dattatreya Hosabale: దేశంలో పెరుగుతోన్న ఆర్థిక అసమానతలు, నిరుద్యోగంపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రెండూ దేశానికి దేయ్యంగా మారిపోయాయని.. అయితే వీటి కొద్ది సంవత్సరాలుగా కొన్ని చర్యలు తీసుకున్నారని ఆర్ఎస్ఎస్ జనరల్ సెక్రెటరీ దత్తాత్రేయ హొసబలే తెలిపారు. ఆత్మనిర్భరత కోసం చేస్తున్న ప్రయత్నాలు సహా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎఫ్‌పిఓ, జన్‌ధన్ వంటి ఇతర కార్యక్రమాలను, ఆరోగ్య సంరక్షణ, డిజిటల్ విప్లవాలు వంటి చర్యలను తాను అభినందిస్తున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.
‘‘20 కోట్ల మంది ప్రజలు పేదరికంలో ఉన్నందుకు మనం చింతించాలి. అలాగే 25 కోట్ల మంది ప్రజల రోజు వారి ఆదాయం 375 రూపాయల కంటే తక్కువగా ఉంది. పేదరికం మనకు దెయ్యంలాగ అవతరించింది. మనం ఆ దెయ్యాల్ని చంపేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది’’ అని ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరన్ మంచ్ నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో దత్తాత్రేయ పేర్కొన్నారు.
Shashi Tharoor on G23: కాంగ్రెస్ పార్టీలో జీ23 గ్రూప్ అనేదే లేదు: శశి థరూర్