Russia-Ukraine Conflict : రష్యా, యు‎క్రెయిన్ అధ్యక్షులతో మోదీ శాంతి చర్చలు

Russia-Ukraine Conflict : ప్రపంచదేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవేళ  భారత ప్రధాని నరేంద్రమోదీ యుద్ధక్షేత్రమైన యుక్రెయిన్‌లో పర్యటించారు. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో కీవ్‌లో భేటీ అయ్యారు. 

India Ringmaster

Russia-Ukraine Conflict : రష్యా-యుక్రెయిన్‌.. బద్ధ శత్రువులు. రెండున్నరేళ్లుగా యుద్ధంతో రగులుతున్న దేశాలు. అలాంటి రణక్షేత్రంలోకి భారత ప్రధాని మోదీ శాంతిమంత్రంతో అడుగుపెట్టారు. గత నెలలో మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శాంతికోసం చర్చలు జరిపిన మోదీ.. ఇప్పుడు యుక్రెయిన్‌  కీవ్‌ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. దీంతో ప్రపంచ దేశాల చూపు మోదీ యుక్రెయిన్‌ టూర్‌పై పడింది. ఇంతకీ మోదీ ఏం చేయబోతున్నారు..?

Read Also : Anil Ambani : అనిల్‌ అంబానీకి సెబీ షాక్‌.. ఐదేళ్ల పాటు నిషేధం.. రూ. 25 కోట్ల జరిమానా..!

ప్రపంచదేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నవేళ  భారత ప్రధాని నరేంద్రమోదీ యుద్ధక్షేత్రమైన యుక్రెయిన్‌లో పర్యటించారు. యుక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీతో కీవ్‌లో భేటీ అయ్యారు.  రష్యా-యుక్రెయిన్‌ మధ్య నెలకొన్న యుద్ధ సంక్షోభంపై ఇద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగింది. పోలాండ్‌ నుంచి రైల్‌ ఫోర్స్‌ వన్‌ ట్రైన్‌లో పది గంటల ప్రయాణం తర్వాత యుక్రెయిన్‌ రాజధాని కీవ్‌ చేరుకున్నారు ప్రధాని మోదీ. ఆయన్ను జెలెన్‌స్కీ సాదరంగా ఆహ్వానం పలికారు. ఇద్దరూ చాలా ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జెలెన్‌స్కీ ఫేస్‌ చాలా డల్‌గా కనిపించింది. మోదీ జెలెన్‌స్కీ భుజాలపై చేతులు వేసి .. ధైర్యంగా ఉండాలని చెబుతూ అన్ని విషయాలను  ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు.

రష్యా యుద్ధం కారణంగా జరిగిన నష్టాన్ని.. ఆ దేశం అనుసరిస్తున్న యుద్ధ విధానాన్ని పూసగుచ్చినట్లు మోదీకి వివరించారు జెలెన్‌స్కీ.. రష్యా సైనికులు ఎలా తమ దేశంపై దాడులతో విరుచుకుపడుతుడ్డారో.. పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలివాళ్ల వరకు ఎంతమందిని పొట్టన పెట్టుకున్నారనేది  విజువల్స్‌, ఫోటో ఎగ్జిబిషన్‌ రూపంలో కళ్లకు కట్టినట్లు చూపించారు జెలెన్‌స్కీ.

రష్యా – యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్ళు కావొస్తోంది. రెండు దేశాలు చాలా తీవ్రంగానే ఆస్తి, ప్రాణనష్టాన్ని చవిచూశాయి. అగ్రదేశాలన్నీ ఈ యుద్ధానికి ఆజ్యం పోస్తున్నాయే కానీ.. ఎవరూ శాంతి చర్చల దిశగా అడుగులు వేయలేదు. ఇండియా-రష్యా శిఖరాగ్ర సమావేశానికి పుతిన్ ఆహ్వానంతో.. ఈ ఏడాది జులై 8న మాస్కోలో పర్యటించారు ప్రధాని మోదీ. ఈ టూర్‌లో పుతిన్‌ -మోదీ  ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఇది  ప్రపంచ దేశాల్లో అనేక ప్రశ్నలకు తావిచ్చింది.

పుతిన్‌, మోదీ కలిసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదే సమయంలో ఈ టూర్‌పై  యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. యుక్రెయిన్‌పై వరుసగా దారుణాలకు పాల్పడుతున్న రష్యాతో.. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ అంత సన్నిహితంగా ఉండటమేంటని ప్రశ్నించారు. మోదీ, పుతిన్ ఫ్రెండ్లీ హగ్‌ రోజే కీవ్‌లోని పిల్లల ఆసుపత్రిపై రష్యా దాడి జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ పోస్ట్ పెట్టారు జెలెన్‌స్కీ. ఆ సమయంలో భారత్‌ వైఖరిని యుక్రెయిన్‌ తప్పు పట్టిందన్న ప్రచారం జోరుగా జరిగింది.

నిజానికి రష్యా అధ్యక్షుడితోనూ మోదీ శాంతి చర్చలే జరిపారు. రష్యా-యుక్రెయిన్ వార్‌  విషయంలో,  భారత్ చాలా స్పష్టమైన, స్థిరమైన వైఖరినే కొనసాగిస్తోంది. దౌత్య చర్చల ద్వారానే ఈ ఘర్షణ పరిష్కారమవుతుందని తెలిపింది. అప్పుడే శాంతి నెలకొంటుందని తేల్చి చెప్పింది.

అందుకే, చర్చలు అత్యంత అవసరమని భావించినట్లు మోదీ పుతిన్‌ ముందు స్పష్టం చేశారు. ఇప్పుడు నెల రోజుల వ్యవధిలోనే  జెలెన్‌స్కీతో యుక్రెయిన్‌లో సమావేశమయ్యారు. ఆయనతోనూ యుద్ధం వద్దని వారించే ప్రయత్నమే మోదీ చేశారు. ఇరు వర్గాలకు ఆమోదయోగ్యమైన మార్గాల ద్వారా మాత్రమే శాంతి స్థాపన సాధ్యమవుతుందని కుండబద్దలు కొట్టారు.

Read Also : Arshad Warsi – Prabhas : డార్లింగ్‌పై అర్షద్‌ వర్సీ కామెంట్స్‌ను లైట్‌ తీసుకున్నారా?

ట్రెండింగ్ వార్తలు