Russia-Ukraine war :ఈవీరుడి కుటుంబాన్ని నేనే చూసుకోవాలి..యుద్ధం పూర్తి అయ్యే వరకు యక్రెయిన్ నుంచి రాను’
యుక్రెయిన్ నుంచి భారత్ కు రావటానికి విద్యార్ధులు నానా పాట్లు పడుతున్నారు. ఓ విద్యార్థిని మాత్రం వచ్చే అవకాశం ఉన్నా యుద్ధం చేయటానికి వెళ్లిన వీరుడు కుటుంబం కోసం..నేనుండాలి అంటోంది

Will Not Come Back From Ukraine Untill War Ends
Haryana Medical Student..will not come back from Ukraine untill war ends : రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకున్న క్రమంలో యుక్రెయిన్ నుంచి ఎప్పుడెప్పుడు ప్రాణాలతో బయటపడదామా?అని వెయ్యి కళ్లతో భయం భయంగా ఎదురుచూస్తున్నారు భారతీయ విద్యార్ధులు. అక్కడి విద్యార్ధులను భారత్ వివామానాల్లో సురక్షితంగా తరలిస్తోంది. చదువు కోసం వెళ్లిన తమ బిడ్డలు యుక్రెయిన్ లో చిక్కుకుని నానా పాట్లు పడుతుంటే వారు ప్రాణాలతో వస్తే చాలు అని ఇటు తల్లిదండ్రులు..కుటుంబ సభ్యులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈక్రమంలో యుక్రెయిన్ నుంచి సురక్షింతగా భారత్ కు వచ్చే అవకాశం ఉన్నా హర్యానాకు చెందిన ఓ విద్యార్థిని మాత్రం రానని చెబుతోంది. ‘ ఏం జరిగినా సరే..యుద్ధం పూర్తి అయ్యాకు వస్తానని తెగేసి చెబుతోంది. ఆమె తీసుకున్న ఈ ఆశ్చర్యకరమైన కఠిన నిర్ణయం వెనుక అసలు కారణం తెలిస్తే హ్యాట్సాఫ్ అనాల్సిందే…
Also read : Indian in Ukraine: పెంపుడు కుక్క కోసం యుద్ధభూమిలోనే ఉండిపోయిన భారతీయుడు
ఉక్రెయిన్ పై అత్యాధునిక ఆయుధాలతో రష్యా విరుచుకుపడుతోంది. రష్యా బలగాలపై ఉక్రెయిన్ కూడా ఏమాత్రం తగ్గేది లేదంటూ..మా దేశం కోసం మేం ఏమైనా చేస్తాం అంటూ యుక్రెయిన్ సైన్యంతో పాటు సామాన్య ప్రజలు కూడా రష్యాపై విరుచుకుపడతున్నారు.రష్యా సేనలను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ ప్రజలు కూడా ఆయుధాలను చేతపట్టారు. కదనరంగంలోకి సామాన్య ప్రజలు కూడా దూకి వారి శక్తికి మించి రష్యా సేనలను అడ్డుకుంటున్నారు. ఈక్రమంలో భారత్ కు చెందిన విద్యార్ధులు ప్రాణాలతో స్వదేశానికి చేరుకోవాలని భారత్ అక్కడఉండే విద్యార్ధుల కోసం పంపించే విమానాలు ఎక్కి వచ్చేస్తున్నారు.
కానీ హర్యానాకు చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థిని మాత్రం భారత్ కు రాను అని చెబుతోంది. మాత్రం తాను ఉక్రెయిలోనే ఉంటానని..యుద్ధం ముగిసేంత వరకు తాను ఇక్కడే ఉంటానని ఆమె తెలిపింది. యుక్రెయిన్ రాజధాని కీవ్ లో ఎంబీబీఎస్ చదువుతున్న హర్యానా విద్యార్థిని ఉంటున్న హాస్టల్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో..ఆమె హాస్టల్ వదిలి కీవ్ నగరంలోనే ఓ భూస్వామ్య కుటుంబం ఇంట్లో అద్దెకు దిగింది. ఆ ఇంట్లో భార్యాభర్తలు, ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు.
Also read : Russia-Ukraine war: పైన బాంబుల మోత..కీవ్ మెట్రో అండర్‌గ్రౌండ్ లో పండంటి పాపకు జన్మనిన మహిళ
ఇక ఆ ఇంటి యజమాని స్వచ్ఛందంగా ఆయుధం చేతబట్టి ఉక్రెయిన్ సైన్యంతో కలిసి యుద్ధంలో పాల్గొన్నాడు. దీంతో ఇంట్లో ఉన్న తల్లి, ముగ్గురు పిల్లలను తాను చూసుకుంటున్నానని ఆమె తెలిపింది. అందుకే యుద్ధం ముగిసేంత వరకు తాను ఇక్కడే ఉంటానని చెప్పింది.