Sabitha Indra Reddy: చీర లాగారు, కిందేసి తొక్కారు.. మహిళా కమిషన్ ముందు సబితా ఆవేదన.. ఢిల్లీ చేరిన అసెంబ్లీ వివాదం
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో మహిళల పట్ల జరిగిన దాడి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy)జాతీయ మహిళా కమిషన్ను కోరింది.
- V Santhosh Kumar
- Updated on- September 11, 2026 / 04:05 PM IST
Sabitha Indra Reddy complaint to NCW in Delhi regarding Telangana Assembly Incident
- సబితా నేతృత్వంలో ఢిల్లీ పోరు
- జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు
- అసెంబ్లీ వద్ద దాడిపై ఆగ్రహం
Sabitha Indra Reddy: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ప్రతిపక్ష మహిళా ప్రజాప్రతినిధులపై జరిగిన దాడి ఘటన రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. శాసనసభ వేదికగా ప్రజా సమస్యలపై నిరసన తెలిపేందుకు వెళ్తున్న తమను పోలీసులు అమానుషంగా అడ్డుకోవడమే కాకుండా, భౌతిక దాడులకు పాల్పడ్డారని బీఆర్ఎస్ మహిళా ప్రజాప్రతినిధులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు జరిగిన అవమానంపై న్యాయం కోసం ఢిల్లీ వేదికగా జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ను వారు ఆశ్రయించారు.
CM Chandrababu: న్యాయం చేయకపోతే ఇలాగే అవుతుంది.. జెన్ జీపై సీఎం చంద్రబాబు ఆసక్తికర కామెంట్స్
‘చీర లాగారు.. తొక్కారు’.. సబితా తీవ్ర ఆవేదన:
శాసనసభకు వెళ్లకుండా దాదాపు 500 మంది పోలీసులతో తమను అడ్డుకున్నారని, మగ పోలీసులు వచ్చి తమతో అమానుషంగా ప్రవర్తించారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indra Reddy) తీవ్రంగా ఆక్షేపించారు. తమ దుస్తులపై ఎలాంటి అభ్యంతరకర రాతలు లేకపోయినా నిలవరించారని, చీరలు లాగుతూ, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలను కింద పడేసి తొక్కిన ఈ దౌర్భాగ్య సంఘటన ఆధునిక కాలంలో పునరావృతమైన ద్రౌపదీ వస్త్రాపహరణాన్ని తలపించిందని, ఇదంతా ప్రభుత్వ కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు.
ఢిల్లీలో జాతీయ కమిషన్కు ఫిర్యాదు:
తెలంగాణ ప్రజాస్వామ్య దేవాలయమైన అసెంబ్లీ ప్రాంగణంలో ప్రజాప్రతినిధులైన మహిళల పట్ల జరిగిన ఈ దుశ్శాసన పర్వంపై సమగ్ర విచారణ జరిపించాలని బీఆర్ఎస్ బృందం జాతీయ మహిళా కమిషన్ను కోరింది. బాధ్యులైన అధికారులతో పాటు, దీని వెనుక ఉన్న ప్రభుత్వ పెద్దలపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలను దేశమంతా గమనిస్తోందని, మహిళా ప్రజాప్రతినిధుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన ఈ ఘటనపై పోరాటం ఆపేది లేదని సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.
