Sachin Pilot Meets Sonia: సోనియాగాంధీతో సచిన్ పైలట్ భేటీ.. రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కీలక మార్పులు తప్పవా?

కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గురువారం ఢిల్లీలోని టెన్ జనపథ్‌లో పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగిన కొద్ది గంటలకే ఈ సమావేశం జరిగింది.

Sachin Pilot Meets Sonia: కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ గురువారం ఢిల్లీలోని టెన్ జనపథ్‌లో పార్టీ తాత్కాలిక అధినేత్రి సోనియా గాంధీ నివాసానికి వెళ్లి ఆమెతో సమావేశమయ్యారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ నుంచి వైదొలిగిన కొద్ది గంటలకే ఈ సమావేశం జరిగింది. రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో సచిన్ పైలెట్ సోనియాగాంధీతో భేటీ కావటం గమనార్హం.

Ashok Gehlot: తన గోతి తానే తవ్వుకున్న గెహ్లాట్.. అధ్యక్ష పదవి ఔట్, సీఎం పదవి హుళక్కే!

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం సోనియాతో భేటీ అయ్యారు. గాంధీ కుటుంబానికి విధేయుడిగా పేరున్న గెహ్లాట్ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే.. రాజస్థాన్ సీఎంగా సచిన్ పైలట్ ను నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధమైంది. ఈక్రమంలో రాజస్థాన్ సీఎం పదవిని వదులుకొని జాతీయ పార్టీ అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు గెహ్లాట్ విముఖత వ్యక్తం చేశాడు. దీనికితోడు ఆదివారం సాయంత్రం పైలట్ తదుపరి ముఖ్యమంత్రి కావడాన్ని వతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రాజస్థాన్ శాసనసభ్యులు, పార్టీ కేంద్ర పరిశీలకులు అజయ్ మాకెన్, మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో జైపూర్‌లోని గెహ్లాట్ నివాసంలో జరిగిన కాంగ్రెస్ శాసనసభా పక్ష (సిఎల్‌పి) సమావేశానికి హాజరు కావడానికి నిరాకరించారు. గెహ్లాట్‌ మాత్రమే సీఎంగా ఉండాలంటూ వారు పట్టుబట్టారు. అంతేకాక సుమారు 90 మందికి పైగా ఎమ్మెల్యేలు తమ రాజీనామాలను స్పీకర్ సీపీ జోషికి సమర్పించారు. ఈ పరిణామాలతో గెహ్లాట్, ఆయన మద్దతు దారులపై సోనియాగాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bihar IAS Officer: కండోమ్స్ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన బీహార్ ఐఏఎస్ అధికారిణి.. సీఎం నితీష్ కుమార్ ఏమన్నారంటే..

ఈ పరిణామాల నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ గురువారం సోనియా గాంధీతో భేటీ అయ్యారు. రాజస్థాన్‌లో ఎమ్మెల్యేల మూకుమ్మడి తిరుగుబాటు చేయడం పట్ల సోనియాకు గెహ్లాట్ క్షమాపణలు చెప్పారు. త్వరలో జరగనున్న కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని ప్రకటించారు. ఈ పరిణామాలు జరిగిన గంటల వ్యవధిలోనే సోనియాతో సచిన్ పైలట్ భేటీ కావటం రాజస్థాన్ కాంగ్రెస్‌లో మార్పులు చోటు చేసుకోబుతున్నాయన్న చర్చ సాగుతోంది. అయితే, మీరు రాజస్థాన్ సీఎంగా కొనసాగుతారా అని గెహ్లాట్‌ను విలేకరులు ప్రశ్నించగా.. సోనియా గాంధీ నిర్ణయం మేరకు నడుచుకుంటానని తెలిపాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

అనంతరం సోనియాతో భేటీ అయిన కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. రాజస్థాన్ సీఎం పదవిపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామంటూ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోనియా.. గెహ్లాట్‌ను రాజస్థాన్ సీఎం స్థానం నుంచి తప్పించి సచిన్ పైలట్‌కు ఆ బాధ్యలు అప్పగిస్తారన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదే జరిగితే రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో కీలక మార్పులు చోటు చేసుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు సోనియా గాంధీ గెహ్లాట్‌ను రాజస్థాన్ సీఎం పదవి నుంచి తప్పించే సాహసం చేయరని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు