Ashok Gehlot: తన గోతి తానే తవ్వుకున్న గెహ్లాట్.. అధ్యక్ష పదవి ఔట్, సీఎం పదవి హుళక్కే!

గాంధీ కుటుంబానికి ఆయన విశ్వనీయతను గుర్తించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది గాంధీ కుటుంబం. నిజానికి ఈ పదవికి ఎన్నిక పెట్టినప్పటికీ గాంధీ కుటుంబం చేత బలపర్చిన గెహ్లాట్ గెలుపు సునాయమేననే విషయం వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇంత వరకు బాగానే ఉంది. అయితే రాజస్తాన్ ముఖ్యమంత్రి మార్పు మీద అధిష్టానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది.

Ashok Gehlot: తన గోతి తానే తవ్వుకున్న గెహ్లాట్.. అధ్యక్ష పదవి ఔట్, సీఎం పదవి హుళక్కే!

Ashok Gehlot did self goal for his down path

Ashok Gehlot: ఏ రంగంలోనైనా ఎదిగేందుకు తమ సామర్థ్యంతో పాటు పరిస్థితులు కూడా అనుకూలించాలి. వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ పోతే అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. రాజకీయాలకు ఇది బాగా వర్తిస్తుంది. తెలంగాణలోని ఒక పల్లెటూరిలో పుట్టిన పీ.వీ.నర్సింహారావు ఇలాగే ఒక్కో మెట్టు ఎక్కుతూ ప్రధానమంత్రి స్థాయికి వెళ్లగలిగారు. అయితే వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోకపోతే.. వచ్చే ప్రతిఫలం రాకపోగా, మొదటికే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు.

రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విషయంలో జరిగింది ఇదే. పిలిచి అధ్యక్ష పదవి ఇస్తామని ఆఫర్ ఇస్తే.. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా, పంతానికి వెళ్లి తన గొయ్యి తానే తవ్వుకున్నారు. వాస్తవానికి గాంధీ కుటుంబం అండదండలు మెండుగా ఉన్న గెహ్లాట్ ఈ ఎన్నికల్లో సునాయాసంగా గెలిచేవారే. కానీ, తన అనుచిత చర్యల వల్ల కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన సంక్షోభం చివరి తన మెడకే చుట్టుకుంది. దీనికంతటికీ కారణం సచిన్ పైలట్‭పై ఆయనకున్న వైరమే.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అశోక్ గెహ్లాట్ ఎంత ముఖ్య కారణమో, సచిన్ పైలట్ కూడా అంతే ముఖ్య కారణం. ఇంకాస్త ఎక్కువ మాట్లాడితే పైలట్ వల్లే ఓట్లు, సీట్లు ఎక్కువ వచ్చాయని అంటుంటారు. అప్పటికే పైలట్.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభాగానికి అధ్యక్షుడు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థని కొందరు ప్రచారం కూడా చేశారు. అయినప్పటికీ అధిష్టానం సీనియారిటీ ప్రాధాన్యతనిస్తూ గెహ్లాట్‭కు సీఎం పదవి కట్టబెట్టింది.

Opposition Alliance: విపక్షాల కూటమిలో చేరేందుకు BSP ఒకే.. కాకపోతే ఒక్క షరతు!

ఇక తాజాగా, గాంధీ కుటుంబానికి ఆయన విశ్వనీయతను గుర్తించి ఏకంగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపిక చేసింది గాంధీ కుటుంబం. నిజానికి ఈ పదవికి ఎన్నిక పెట్టినప్పటికీ గాంధీ కుటుంబం చేత బలపర్చిన గెహ్లాట్ గెలుపు సునాయమేననే విషయం వేరే చెప్పనక్కర్లేదు. అయితే ఇంత వరకు బాగానే ఉంది. అయితే రాజస్తాన్ ముఖ్యమంత్రి మార్పు మీద అధిష్టానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గెహ్లాట్ చేత ఆ పదవికి రాజీనామా చేయించి పైలట్‭ను సీఎం చేయడానికి పూనుకున్నారు.

ఇక్కడే గెహ్లాట్ తప్పు చేశారు. తనకు జాతీయ అధ్యక్ష పదవి వచ్చిందని సంతృప్తి చెందకుండా ప్రత్యర్థి పైలట్‭కు ముఖ్యమంత్రి పదవి దక్కకుండా ఉండేందుకు పావులు కదిపారు. పైలట్‭ను సీఎం చేయకూడదంటూ తనకు మద్దతుగా ఉండే ఎమ్మెల్యేల చేత పెద్ద ఎత్తున రాజీనామా చేయించారు. అంతే కాకుండా తన వర్గంలోని వ్యక్తిని, తనకు విశ్వాసంగా ఉండే వ్యక్తినే సీఎం చేయాలని తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేల చేత చెప్పించారు.

Congress President Poll: ఒకే ఒరలో రెండు కత్తులు.. దిగ్విజయ్ సింగ్‭ను కలుసుకున్న శశి థరూర్

వాస్తవానికి ఈ చర్యతో ఒకే దెబ్బకు రెండు పిట్టలని గెహ్లాట్ భావించి ఉంటారు. అంటే, ఒకవైపు తాను జాతీయ అధ్యక్షుడిని అవుతూనే, రెండో వైపు పైలట్‭ను నిలవరిస్తూ తన మనిషిని సీఎం చేయడానికి అధిష్టానం ఒప్పుకుంటుందని అనుకున్నారు. కానీ ఇక్కడే ఆయనకు చుక్కెదురైంది. రాజస్తాన్ వివాదం కాంగ్రెస్ పార్టీలో కొత్త తలనొప్పిని తీసుకు రావడంతో అధ్యక్ష పదవి నుంచి గెహ్లాట్ తప్పుకోవాల్సి వచ్చింది.

ఇంతటితో ఆగకుండా రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి కూడా ఆయనను తప్పించనున్నారట. ఇప్పటికే అనుకున్నట్లు పైలట్‭కు పగ్గాలు అప్పగించాలని గాంధీ ఫ్యామిలీ భావిస్తోందని సమాచారం. మెజీషియన్ స్థాయి నుంచి ఎదిగి.. ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన గెహ్లాట్.. ఏకంగా పార్టీ అధినేత పదవి ఆఫర్ వస్తే, వ్యక్తిగత వైరానికి పోయి వచ్చేది కోల్పోయారు, ఉన్నది కూల్చుకునేలా ఉన్నారు.

Ruby Asif Khan: ఇంట్లో నవరాత్రి ఉత్సవాలు చేపట్టిన ముస్లిం మహిళ.. చంపేస్తామంటూ బెదిరింపులు