Bihar IAS Officer: కండోమ్స్ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన బీహార్ ఐఏఎస్ అధికారిణి.. సీఎం నితీష్ కుమార్ ఏమన్నారంటే..

బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో బీహార్ మహిళా ఐఏఎస్ అధికారిణి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఐఏఎస్ అధికారిణి క్షమాపణలు చెప్పారు.

Bihar IAS Officer: కండోమ్స్ వ్యాఖ్యలపై క్షమాపణలు కోరిన బీహార్ ఐఏఎస్ అధికారిణి.. సీఎం నితీష్ కుమార్ ఏమన్నారంటే..

Bihar IAS officer Harjot Kaur

Bihar IAS Officer: బీహార్ రాష్ట్రం పాట్నాలో జరిగిన ఓ వర్క్‌షాప్‌లో బీహార్ మహిళా ఐఏఎస్ అధికారిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాఠశాల విద్యార్థిని శానిటరీ ప్యాడ్‌లను మరింత తక్కువ ధరకు అందుబాటులోకి తీసుకురావాలని అడగగా.. వాటిని తక్కువ ధరకు ఇస్తే.. మీరు కండోమ్స్ కూడా అడుగుతారు అంటూ ఐఏఎస్ అధికారిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. సెప్టెంబర్ 27న జరిగిన ఈ కార్యక్రమంలో ఐఏఎస్ అధికారిని చేసిన వ్యాఖ్యలను బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో ఆమెపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు ఐఏఎస్ అధికారిని క్షమాపణలు చెప్పారు.

Minister Botsa Satyanarayana: ఏపీకి వచ్చిచూడు.. అసలు విషయం తెలుస్తుంది.. హరీశ్‌రావు వ్యాఖ్యలకు మంత్రి బొత్స కౌంటర్ ..

బీహార్ ఐఏఎస్ అధికారిణి హర్జోత్ కౌర్ .. ఉమెన్ డవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తుంది. యువతులకు శానిటరీ ప్యాడ్స్ ను అందుబాటు ధరల్లో ప్రభుత్వమే అందించడం జరుగుతుందా అని ఓ బాలిక ప్రశ్నించగా.. ఇప్పుడు మీరు శానిటరీ ప్యాడ్స్ అడుగుతున్నారు.. రేపు కండోమ్స్ అండుతారు అంటూ ఆమె సమాధానం ఇచ్చింది. అయితే ఆమె వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపడంతో.. హర్జోత్ క్షమాపణలు చెప్పారు. నేను ఏ బాలిక సెంటిమెంట్లను కించపరిచి ఉంటే నన్ను క్షమించాలని, నేను ఎవరినీ అవమానపర్చేందుకు, ఎవరి మనోభావాలను కించపర్చాలన్న భావన నాకులేదని, తన మాటలకు ఎవరి మనోభావాలైనా గాయపడిఉంటే అందుకు తాను చింతిస్తున్నానని ట్విటర్ వేదికగా ఆమె పేర్కొన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇదిలాఉంటే.. జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖాశర్మ స్పందించారు.. కండోమ్స్ వ్యాఖ్యలపై ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి హర్జోత్ కౌర్ ను ఆదేశించారు. మరోవైపు బీహార్ రాష్ట్రంలో తీవ్ర దుమారానికి దారితీసిన ఐఏఎస్ అధికారిని వ్యాఖ్యలపట్ల సీఎం నితీష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై స్పందించిన నితీష్.. హర్జోత్ కౌర్ పై చర్యలు తీసుకుంటామని, ఇటీవల స్కూల్ బాలిక ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాదానం సిగ్గుపడేదిలా ఉందని, ఈ ఘటనపై విచారణ జరపాలని ఆదేశాలు జారీ అయ్యాయని అన్నారు. ఆమెపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని సీఎం నితీష్ కుమార్ తెలిపారు.