మతం అడ్డు కాదు: వినాయకునికి హారతి ఇచ్చి స్టెప్పులేసిన సల్మాన్ ఖాన్

  • Published By: vamsi ,Published On : September 4, 2019 / 09:41 AM IST
మతం అడ్డు కాదు: వినాయకునికి హారతి ఇచ్చి స్టెప్పులేసిన సల్మాన్ ఖాన్

Updated On : September 4, 2019 / 9:41 AM IST

కొందరు మతం పేరుతో… మూఢ నమ్మకాల పేరుతో పరాయి మతం వాళ్లను దూషిస్తూ ఉంటారు.. ఇబ్బందులు పెడుతుంటారు. కొందరైతే ప్రసాదాలను కూడా స్వీకరించరు. కానీ బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ మాత్రం అటువంటి మత పరిమితులు మాత్రం లేవు అంటున్నారు. మత పట్టింపులు లేకుండా హిందువుల పండుగ.. ముస్లీంల ఫెస్టివల్ అనే భేదం లేకుండా ప్రతీ పండుగను ఘనంగా జరుపుకుంటుంటారు సల్మాన్ ఖాన్.

ఈ క్రమంలోనే లేటెస్ట్ గా సల్మాన్ ఖాన్ వినాయకుని ముందు చిందేసి తన లౌకికత్వ స్వభావాన్ని చాటుకున్నాడు. సల్మాన్ ఖాన్ సోద‌రి అర్పితా ఖాన్ ప్రతీ సంవత్సరం ఇంట్లో వినాయ‌కుడిని పెట్టుకుని, ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తుంది. ఈ ఏడాది కూడా అలాగే వినాయకుని విగ్ర‌హాన్ని పెట్టుకుని మంగ‌ళ‌వారం నిమ‌జ్జ‌నం చేశారు.

ఈ నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మానికి వచ్చిన స‌ల్మాన్ ఖాన్, స్వ‌ర భాస్క‌ర్, డైసీ షా వినాయకుని ముందు తీన్మార్ స్టెప్పులు వేశారు. స‌ల్మాన్ వేసిన స్టెప్పులు అక్క‌డిని వారిని ఎంత‌గానో ఆక‌ట్టుకోగా సల్మాన్ కు సంబంధించిన వీడియోలు ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. అలాగే స‌ల్మాన్ త‌న మేన‌ల్లుడు అహిల్‌ని ఎత్తుకొని వినాయ‌కుడికి హార‌తి ఇచ్చిన వీడియో.. త‌ల్లి స‌ల్మా ప‌క్క‌న కూర్చొని భ‌జ‌న చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.