స్పెషల్ ఎట్రాక్షన్‌ :మెరుపు వేగంతో దూసుకెళ్లే గుర్రం రూ.10 కోట్లు..!!

  • Published By: veegamteam ,Published On : December 23, 2019 / 05:48 AM IST
స్పెషల్ ఎట్రాక్షన్‌ :మెరుపు వేగంతో దూసుకెళ్లే గుర్రం రూ.10 కోట్లు..!!

Updated On : December 23, 2019 / 5:48 AM IST

గుర్రాలలో మేలు గుర్రాలు వేరు. ముఖ్యంగా అరేబియన్ గుర్రాలకు మంచి పేరుంది. కానీ ఈ గుర్రం అలాంటిలాంటి గుర్రం కాదు..దాని పరుగు వేగం చూస్తే..మెరుపు కూడా చిన్నబోతుందేమో అనిపిస్తుంది. దీని వేగాన్ని చూసి అశ్వ ప్రియులు సొంతం చేసుకోవాలని ఉబలాటపడతారు. కానీ దాని ఖరీదు ఉంటే కోటీశ్వరులు కూడా ఆశ్చర్యపోవాల్సిందే. 

ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను మించి అత్యంత వేగంగా పరుగులంఘించే గుర్రం వెరీ వెరీ స్పెషల్. మహారాష్ట్రలోని సారంగ్‌ఖెడాలో ప్రస్తుతం జరుగుతున్న చెతక్ ఉత్సవంలో ఈ ఫాస్టెస్ రన్నింగ్ గుర్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఆశ్చర్యపరుస్తోంది. ఈ గుర్రం పేరు ‘షాన్’. ఈ గుర్రం యజమాని తారాసింగ్… పంజాబ్‌లోని అమృత్ సర్‌లో ఉంటారాయన.

చెతక్ ఉత్సవానికి వచ్చిన తారాసింగ్ మాట్లాడుతూ ‘షాన్’ మార్వాడీ జాతికి చెందిన గుర్రమని, ఇది గుర్రాల పరుగుపందెంలో ఛాంపియన్‌గా నిలిచిందని తెలిపారు. దీన్ని వేగాన్ని ఇప్పటివరరూ ఏ గుర్రం కూడా అందుకోలేదని చెప్పారు. ఎక్స్‌ప్రెస్ ట్రైన్ స్పీడ్ కూడా దీని స్పీడ్ ముందు బలాదూరే నని గర్వంగా చెప్పారు తారాసింగ్, గంటకు 80 కిలోమీటర్ల వేగానికి మించి ‘షాన్’ పరిగెడుతుందన్నారు. ఈ గుర్రం ఖరీదు రూ. 10 కోట్లని చెప్పారు.  కాగా చెతక్ ఉత్సవానికి రాజస్థాన్, పంజాబ్, హరియాణా తదితర రాష్ట్రాల నుంచి సుమారు 500 గుర్రాలను తీసుకువచ్చి ప్రదర్శిస్తున్నారు. అలా ప్రదర్శనలో ఉన్న అన్ని గుర్రాల కంటే ‘షాన్’ వెరీ వెరీ స్పెషల్ గా అందరినీ ఆకర్షిస్తోంది. కళ్లు తిప్పుకోనివ్వని రాజసం ఈ ‘షాన్’ సొంతం అనిపిస్తోంది. 

మహారాష్ట్రలోని నందూర్‌బార్‌లోని తాపి నది ఒడ్డున ఉన్న సారంగ్‌ఖేడా డిసెంబర్ 12 నుండి జనవరి 8 వరకు కొనసాగుతుంది. గుర్రపు వాణిజ్య ఉత్సవానికి చాలా పేరుంది. మహారాణా ప్రతాప్‌కు ఇష్టమైన గుర్రం పేరు పెట్టబడిన సారంగ్‌ఖేదా చేతక్ ఫెస్టివల్‌గా మారింది. ఎంతోమంది అశ్వ ప్రియుల్ని ఆకర్షిస్తోంది.