Sarla Thukral : గూగుల్ డూడుల్ సరళ, చీరకట్టులో విమానం నడిపారు..తొలి మహిళా పైలట్

భారత తొలి మహిళా పైలెట్..సరళ థక్రాల్. సంప్రదాయబద్ధంగా కట్టుకున్న చీరలో ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు. ఆగస్టు 08వ తేదీ ఈమె 107 జయంతి. అందుకే గూగుల్ డూడుల్ తో గుర్తు చేసింది. వాస్తవానికి గత సంవత్సరం సరళ పేరి డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది.

Google Doodle : గూగుల్..సామాజిక మాధ్యమాల్లో ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఎలాంటి సమాచారాన్ని అయినా..ఇది అందిస్తుంది. అయితే..ప్రముఖుల విషయంలో, ఇతర ముఖ్యమైన రోజుల్లో గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ తయారు చేస్తుందనే సంగతి తెలిసిందే. తాజాగా…గూగూల్ సరికొత్త డూడుల్ ను రూపొందించింది. అందులో చీర కట్టింది…కాక్ పిట్ లో కూర్చొంది..ఇది చూసిన వారికి ఈమె ఎవరు అనే దానిపై నెటిజన్లు సెర్చ్ చేశారు.

Read More : Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్ పతకాల పట్టికలో 48వ స్థానంలో భారత్..చైనాను అధిగమించిన అమెరికా

భారత తొలి మహిళా పైలెట్..సరళ థక్రాల్. సంప్రదాయబద్ధంగా కట్టుకున్న చీరలో ఎయిర్ క్రాఫ్ట్ ను నడిపారు. ఆగస్టు 08వ తేదీ ఈమె 107 జయంతి. అందుకే గూగుల్ డూడుల్ తో గుర్తు చేసింది. వాస్తవానికి గత సంవత్సరం సరళ పేరి డూడుల్ రిలీజ్ కావాల్సి ఉంది. ఆ సమయంలో కేరళ రాష్ట్రంలో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డూడుల్ రూపొందించడం సరికాదని అనుకుని..డూడుల్ ను నిలిపివేశారు.

Read More : Manchu Manoj: తెలంగాణ మంత్రులతో మంచు మనోజ్ చర్చలు!

ఈ సంవత్సరం ఆమె మీద గౌరవరార్థం…డూడుల్ ను ఉంచినట్లు గూగుల్ సంస్థ వెల్లడించింది. ఎయిర్ క్రాఫ్ట్ లో చీర కట్టులో ఉన్న ఈ డూడుల్ ను వ్రిందా జవేరీ రూపకల్పన చేశారు. వైమానిక రంగంలో మహిళల ప్రవేశానికి స్పూర్తినిస్తూ..చరిత్రలో ఒక చెరగని ముద్ర వేశారని గూగుల్ వెల్లడించింది. ఇక సరళ విషయానికి వస్తే…1914లో జన్మించిన ఈమె…16 ఏళ్ల వయస్సులో వివాహం జరిగింది. ఆమె భర్త పైలెట్. ఆయన స్పూర్తితో పైలెట్ అవ్వాలని అప్పుడే డిసైడ్ అయిపోయారు. నాలుగేళ్ల పాప ఉండగానే..చీర కట్టులో లాహోర్ ఫ్లెయింగ్ క్లబ్ తరపున విమానం నడిపి ఏ గ్రేడ్ లైసెన్స్ దక్కించుకున్నారు.

Read More : CJI : పోలీస్‌ స్టేష‌న్‌ల‌లో మానవహక్కుల ఉల్లంఘన..ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు

అప్పుడు ఆమె వయస్సు 21 ఏళ్లు. అనంతరం కమర్షియల్ పైలెట్ శిక్షణ కోసం జోధ్ పూర్ వెళ్లారు. 1939లో భర్త చనిపోవడం, రెండో ప్రపంచ యుద్ధం రావడంతో పైలెట్ కావాలనే కల చెదిరింది. తర్వాత..లాహోర్ కు వెళ్లి ఫైన్ ఆర్ట్స్, పెయిటింగ్ కోర్సులు నేర్చుకున్నారు. విభజన అనంతరం ఢిల్లీకి వచ్చి ఆర్ పీ త(తు)కల్ ను వివాహమాడారు. ఇతర వ్యాపారాలు చేసి సక్సెస్ అయిన సరళ…2008లో అనారోగ్యంతో కన్నుమూశారు.

ట్రెండింగ్ వార్తలు