Manchu Manoj: తెలంగాణ మంత్రులతో మంచు మనోజ్ చర్చలు!

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో సినీ హీరో మంచు మనోజ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలోని టూరిజంపై జరిగిన ఈ భేటీపై ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Manchu Manoj: తెలంగాణ మంత్రులతో మంచు మనోజ్ చర్చలు!

Manchu Manoj

Manchu Manoj: తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, క్రీడా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ లతో సినీ హీరో మంచు మనోజ్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తెలంగాణలోని టూరిజంపై జరిగిన ఈ భేటీపై ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరిలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుండో తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ ప్రాజెక్టుపై మంత్రులు, అధికారులు సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలోనే మంచు మనోజ్ కూడా పాల్గొని తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన టూరిజం ప్రాజెక్ట్స్‌ లో పలు అంశాలపై చర్చించారు. అనంతగిరిలో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత ప్రాజెక్ట్ కోసం ఇప్పటికే ప్రభుత్వం పెట్టుబడులను ఆహ్వానిస్తుంది. ఇందులో భాగంగానే కొందరు ప్రముఖులు ఇప్పటికే రూ.150 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తుండగా ఇందులో సినిమావాళ్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

కాగా, ఈ సమావేశంలో అనంతగిరితో పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి టూరిజంను ఏ విధంగానే చేపట్టాలో చర్చలు జరపగా.. అనంతరగిరి టూరిజం ప్రాజెక్ట్‌తో చాలా మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 1000 మందికి ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ భేటిలో మనోజ్ కుమార్ అడ్వెంచర్ టూరిజంతో పాటు వెల్‌నెస్ సెంటర్ ఏర్పాటుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి మంత్రులు, ఉన్నతాధికారులతో తన అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలుస్తుంది.