Odisha : సర్పంచ్ ఎన్నిక కోసం.. భార్య మెడలో మరోసారి తాళి కట్టాడు!

తన భార్యను రంగంలోకి దింపాలని ప్రశాంత పొళాయి అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు. శ్రీ కృష్ణశరణ్ పూర్ కు చెందిన ప్రభాతి సాహూను అతను న్యాయస్థానంలో వివాహం చేసుకున్నాడు. ఎన్నికల ప్రక్రియలో.

Odisha : సర్పంచ్ ఎన్నిక కోసం.. భార్య మెడలో మరోసారి తాళి కట్టాడు!

Suarpanch

Updated On : January 29, 2022 / 1:21 PM IST

Khallikote Sarpanch Candidate : సర్పంచ్ పదవి కోసం జరుగుతున్న ఎన్నికల్లో తన భార్యను నిలబెట్టాడు. కానీ..ఎందుకు అతనికి ఓ విషయంలో అనుమానాలు కలుగుతున్నాయి. ఎవరినో తీసుకొచ్చి అభ్యర్థిగా నిలిపాడని ప్రత్యర్థులు ప్రచారం చేస్తే ఎలా ? అనే డౌట్ వచ్చింది అతనికి. వెంటనే ఓ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. మళ్లీ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాడు. పెళ్లి వేదికలో మరోసారి తాళి కట్టాడు. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. గంజాం జిల్లా కళ్లికోట సమితిలో అయితాపూర్ పంచాయతీ ఉంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ఎన్నికలు జరుగనున్నాయి. రిజర్వేషన్ లో ఆ సర్పంచ్ స్థానం మహిళకు కేటాయించారు.

Read More : Lakshmi Pranathi : సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ భార్య ప్రణతి.. లవ్లీ హస్బెండ్ అంటూ ఫస్ట్ పోస్ట్..

దీంతో తన భార్యను రంగంలోకి దింపాలని ప్రశాంత పొళాయి అనే వ్యక్తి నిర్ణయించుకున్నాడు. శ్రీ కృష్ణశరణ్ పూర్ కు చెందిన ప్రభాతి సాహూను అతను న్యాయస్థానంలో వివాహం చేసుకున్నాడు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా కోర్టు వివాహపత్రాన్ని జతపరిచి సర్పంచ్ అభ్యర్థినిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే..ప్రత్యర్థులు తనపై దుష్ర్పచారం చేసే అవకాశం ఉందని భావించాడు. ఎవరినో తీసుకొచ్చి ఎన్నికల బరిలో దింపాడని ప్రచారం చేసే అవకాశం ఉందని, దీనిని గ్రామాల ఓటర్లు కూడా నమ్మేస్తారనే భయం పట్టుకుంది. వెంటనే పంచాయతీలోని ఓ మందిరంలో సంప్రదాయబద్ధంగా ప్రభాతిని మరోసారి వివాహం చేసుకున్న ప్రశాంత్ వార్తల్లో నిలిచాడు. మరి ప్రభాతి సాహూ సర్పంచ్ గా గెలుస్తుందా ? ఓటర్లు ఆమెకు అనుకూలంగా ఓట్లు వేస్తారా ? లేదా ? అనేది చూడాలి.