SBI Customer Alert : ఆ మెసేజ్‌తో జాగ్రత్త.. క్లిక్ చేస్తే ఖతమే.. ఎస్బీఐ కస్టమర్లకు కేంద్రం హెచ్చరిక

సైబర్ నేరగాళ్ల కన్ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లపైన పడింది. ఫేక్ మెసేజ్, నకిలీ లింక్ లతో వారి ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

SBI Customer Alert : సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు తెగబడుతున్నారు. అమాయకులను అడ్డంగా మోసం చేస్తున్నారు. ఫేక్ మెసేజ్ లు, నకిలీ లింకులతో బ్యాంకు ఖాతాలను లూటీ చేస్తున్నారు. తాజాగా సైబర్ నేరగాళ్ల కన్ను దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లపైన పడింది. సైబర్ క్రిమినల్స్ ఎస్బీఐ కస్టమర్లను టార్గెట్ చేశారు. ఫేక్ మెసేజ్, నకిలీ లింక్ లతో వారి ఖాతాలను ఖాళీ చేసే ప్రయత్నంలో ఉన్నారు.

Sbi

Whatsapp Backup : మీ వాట్సాప్‌లో చాట్, ఫొటో డేటా ఆటో బ్యాకప్ తీసుకోండిలా..!

ఇటీవల ఎస్బీఐ కస్టమర్ల ఫోన్లకు ఓ మెసేజ్ వస్తోంది. మీ ఎస్బీఐ ఖాతా బ్లాక్ చేయబడింది. సంబంధిత వివరాలతో మళ్లీ మీ ఖాతాను పునరుద్ధరించుకోండి అన్నది ఆ మెసేజ్ సారాంశం. ఆ మెసేజ్ తో పాటే ఓ లింకు కూడా దర్శనమిస్తోంది.

Cyber Crime

TRAI Caller Name Display : ఇకపై ఎవరు కాల్ చేశారో తెలుసుకోవచ్చు.. త్వరలో అద్భుతమైన ఫీచర్

అయితే ఇది ఫేక్ మెసేజ్ అని, దీంతో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది. కేంద్ర సమాచార ప్రసార శాఖ (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ఇది నకిలీ మెసేజ్ అని స్పష్టం చేసింది. ఎస్బీఐ తన ఖాతాదారులకు ఎప్పుడూ ఇలాంటి సందేశాలు పంపదని ఫ్యాక్ట్ చెక్ విభాగం తేల్చి చెప్పింది.

Sbi Alert (1)

ATM Withdraw Money : ఏటీఎంలో డెబిట్, క్రెడిట్ కార్డు లేకుండానే డబ్బులు విత్‌డ్రా చేయొచ్చు!

ఒకవేళ మీ ఫోన్లకు, మెయిల్ కు ఈ తరహా సందేశాలు వస్తే అప్రమత్తతో వ్యవహరించాలని కేంద్రం సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాంకు ఖాతా వివరాలను పంచుకోవద్దని హెచ్చరించింది. ఈ ఫేక్ మెసేజ్ పై ఎవరైనా ఎస్బీఐ దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే report.phishing@sbi.co.in కు మెయిల్ చేయాలని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం తెలిపింది.

ట్రెండింగ్ వార్తలు