Whatsapp Backup : మీ వాట్సాప్‌లో చాట్, ఫొటో డేటా ఆటో బ్యాకప్ తీసుకోండిలా..!

Whatsapp Backup : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లో చాటింగ్, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుంటారు.

Whatsapp Backup : మీ వాట్సాప్‌లో చాట్, ఫొటో డేటా ఆటో బ్యాకప్ తీసుకోండిలా..!

How To Backup Whatsapp Photos, Chats And Enable Security Feature

Whatsapp Backup : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ను మిలియన్ల మంది యూజర్లు వినియోగిస్తున్నారు. వాట్సాప్ యూజర్లు తమ అకౌంట్లో చాటింగ్, ఫొటోలు, వీడియోలు పోస్టు చేస్తుంటారు. వాట్సాప్ అకౌంట్లో మీరు పోస్టు చేసే ప్రతి ఫొటో, వీడియోలకు సంబంధించిన డేటా మొత్తం ఆటో బ్యాక్ అవుతుంటుంది. మిలియన్ల మంది యూజర్లు WhatsAppని ఉపయోగిస్తున్నారు. యూజర్లకు సంబంధించిన చాట్‌లు చాలా ముఖ్యమైనవి. అందుకే వాట్సాప్ వారి డేటాను భద్రంగా స్టోర్ చేస్తుంటుంది. Google డిస్క్‌లో చాట్‌ల హిస్టరీని ఉంచడానికి ఒక ఆప్షన్ అందిస్తుంది. వాట్సాప్ యూజర్లు తమ చాట్‌ల కోసం ఆటోమేటిక్ బ్యాకప్ ఫీచర్‌ను ఎనేబుల్ చేసే ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే ఈ ఫ్రీక్వెన్సీని రోజువారీగా, వారంవారీగా లేదా నెలవారీగా ఎంచుకునే వీలుంది. వాట్సాప్ చాట్ డేటాను గూగుల్ డ్రైవ్ లో ఎలా బ్యాకప్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

వాట్సాప్ చాట్‌.. గూగుల్ డ్రైవ్‌కి బ్యాకప్ ఎలా?
వాట్సాప్‌లో చాట్ బ్యాకప్ ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది.
మీరు సెట్టింగ్స్ ప్రధాన స్క్రీన్ టాప్ రైట్ కార్నర్‌లో కనిపించే త్రి డాట్స్ ఐకాన్‌పై నొక్కండి.
Settings Chats > Chat Backup > Google Diskకి బ్యాకప్ చేయండి.
“Never” కాకుండా బ్యాకప్ ఫ్రీక్వెన్సీని ఎంచుకోవాలి.

Note : మీరు బ్యాకప్‌ని డైలీ, వీక్లీ లేదా మంత్లీకి సెట్ చేయవచ్చు. బ్యాకప్ ఆప్షన్ ఎంచుకునేందుకు ఒక ఆప్షన్ కూడా ఉంది. మీరు చాట్‌లను బ్యాకప్ చేసేందుకు ప్రతిసారీ సెట్టింగ్స్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అందుకే ఈ ఆప్షన్ ప్రతిసారీ ఎంచుకోవాల్సి అవసరం లేదు. డైలీ లేదా వీక్లీ ఆప్షన్ ఎంచుకోవడం ఎల్లప్పుడూ మంచిది. తద్వారా మీ చాట్‌లు ఎప్పటికప్పుడు ఆటోమాటిక్‌గా బ్యాకప్ అవుతాయి.

How To Backup Whatsapp Photos, Chats And Enable Security Feature (1)

How To Backup Whatsapp Photos, Chats And Enable Security Feature 

మీ చాట్ హిస్టరీని బ్యాకప్ చేయాలంటే Google అకౌంట్ ఎంచుకోండి..
మీకు Google అకౌంట్ కనెక్ట్ కాకుంటే.. ప్రాంప్ట్ మెసేజ్ వస్తుంది. “అకౌంట్ యాడ్”పై నొక్కగానే.. మీ లాగిన్ వివరాలను ఎంటర్ చేయాలి.
మీరు బ్యాకప్‌ల కోసం ఏ నెట్‌వర్క్‌ను ఎంచుకుంటారో Backup Over నొక్కండి.

Note : మీరు సెల్యులార్ డేటా నెట్‌వర్క్ ద్వారా బ్యాకప్ చేయాలని ఎంచుకుంటే.. మీ డేటా తొందరగా అయిపోయే అవకాశం ఉంది. Wi-Fi ద్వారా బ్యాకప్ చేయడమే మంచిది. ఫలితంగా అత్యవసర సమయాల్లో మొబైల్ డేటాను సేవ్ చేసుకోవచ్చు.

WhatsApp బ్యాకప్‌ సెక్యూరిటీ ఫీచర్‌ ఎనేబుల్ ఇలా :
మీరు మీ చాట్‌లను థర్డ్-పార్టీ సర్వీస్‌కి బ్యాకప్ చేస్తున్న సమయంలో అదనపు డేటా లేయర్ సెటప్ చేయాల్సి ఉంటుంది. అందుకు WhatsApp మిమ్మల్ని అనుమతిస్తుంది. వాట్సాప్ యూజర్లు మీ Google డిస్క్ బ్యాకప్ కోసం End-to-End ఎన్‌క్రిప్షన్‌ను ఆన్ చేయవచ్చు.

WhatsApp ఓపెన్ చేసి.. More Options > Settings > Chats > Chat Backup > End- To- End ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌పై నొక్కండి.
Turn On బటన్‌పై నొక్కండి.
మీ పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయండి.. లేదా 64-అంకెల ఎన్‌క్రిప్షన్ కీని ఉపయోగించండి.
మీ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ బ్యాకప్‌ని క్రియేట్ చేయడానికి Create ఆప్షన్‌పై నొక్కండి.

Read Also : WhatsApp Chat Filters : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ పాత చాట్ క్షణాల్లో వెతికిపెడుతుంది..!